జహీరాబాద్, అక్టోబర్ 31: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అమలు చేయని పథకాలు ఇక్కడ చేస్తారా..? అని జహీరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్‌రావు ప్రశ్నించారు. మంగళవారం జహీరాబాద్ మండల పరిధిలోని అర్జున్నాయక్తండా, అనెగుంట, లచ్చనాయక్తండాకు, శేకాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి దేవీప్రసాద్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం, టీఎస్ఐడీసీ చైర్మన్ తన్వీరు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నదన్నారు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ఎందుకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. జహీరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటే మీ మాణిక్‌రావును ఎన్నికల్లో ఓట్లు వేసి ఆశీర్వదించాలన్నారు.
పేదల పక్షాన ఉండే ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి దేవీప్రసాద్ తెలిపారు. కర్ణాటక మాదిరిగా తెలంగాణను అభివృద్ధి చేస్తామని, కాంగ్రెస్ నాయకులు తెలుపుతున్నారని, అదే కర్ణాటకలో ఎందుకు వ్యవసాయానికి సరిగ్గా కరెంట్ ఇవ్వడం లేదన్నారు. కర్ణాటకలో అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తామని ప్రకటించి మోసం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పేదల కోసం మంచి మ్యానిఫెస్టో ఏర్పాటు చేసిందన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. సమావేశంలో ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, రైల్వే బోర్డు సభ్యులు షేక్ ఫరీదు, టెలికం బోర్డు సభ్యులు, గిరిజన తండాల ఇన్చార్జి పవార్ శంకర్‌నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జి.గుండప్ప, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తట్టు నారాయణ, బీఆర్ఎస్ నాయకులు మచ్చేందర్, తాజోద్దీన్, అనుషమ్మ, మాణిక్యమ్మ, శీలారమేశ్, మంజుల, సరస్వతీరెడ్డి, నారాయణ, మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ జ్యోతి, జగదీశ్వర్, హీరురాథోడ్, చెన్నారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.