Rayapol | రాయపోల్ జనవరి 15. సంక్రాంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో గురువారం సంక్రాంతి సంబురాలను ప్రజలు అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం వారి వారి ఇళ్ల ముందు రంగురంగులతో ముగ్గులు వేసి సంక్రాంతి వేడుకల శుభాకాంక్షలు తెలియజేసే విధంగా ఇళ్ల ముందు ముగ్గులు వేయడంతో గ్రామాల్లో సంక్రాంతి పండుగ కొత్త శోభను సంతరించుకుంది.
హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వారి వారి స్వగ్రామాలకు చేరడంతో ఈ గ్రామంలో చూసిన జనంతో కళకల్లాడిపోయింది. ఆయా గ్రామాల్లో వివిధ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే కొన్ని గ్రామాల్లో జాతర్లకు పిల్లాపాపలతో వెళ్లారు. మండలంలోని అనాజీపూర్ లోని బయ్యన గుండ్ల జాతర జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి భయ్యగుండ్ల జాతరలో స్వామివారి మొక్కులు చెల్లించుకున్నారు. అప్పాయ్యపల్లి గ్రామంలో భారతి,భవాని, స్వప్న తదితర వారి ఇండ్ల ముందు సంక్రాంతి ముగ్గులు వేయగా ఎంతగానో ఆకట్టుకున్నాయి. అప్పాయ్యపల్లి రైల్వే లైన్ వద్ద చిన్నారులు, యువకులు గాలిపటాలు ఎగురవేసి సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. మండల వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు వైభవం నిర్వహించారు.