రామాయంపేట, ఏప్రిల్ 5: తమకు ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వకుండా, పీఎఫ్ జమచేయకుండా వెట్టిచాకిరి చేయిస్తున్నారని, మున్సిపల్ కమిషనర్ తమ సంక్షేమాన్ని విస్మరించారని రామాయంపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట శనివారం పారిశుధ్య కార్మికులు నిరసనకు దిగారు.
శనివారం పనులు మానేసి కార్మికులంతా కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దీంతో కమిషనర్ ఇతర కూలీలతో పారిశుధ్య పనులు చేయించారు. ఇది చూసిన కార్మికులు కమిషనర్ కార్యాలయం లోకి వెళ్లి తమకు వచ్చే పీఎఫ్, వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కమిషనర్ తమను తిట్టారని విలేకరుల ఎదుట పారిశుధ్య కార్మికులు ఆరోపించారు.