Heart Attack | జహీరాబాద్, జనవరి 30 : సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. జహీరాబాద్ సబ్ డివిజన్ ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సీహెచ్ నారాయణ గుండెపోటుతో మరణించారు.
జహీరాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. న్యాల్కల్ మండలం చీకుర్తి గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ నారాయణ (55) గత కొంతకాలంగా ఇంటెలిజెన్స్ పోలీస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ వివరాలు సేకరిస్తున్నారు. అయితే గురువారం రాత్రి బైపాస్ రోడ్డు నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా నారాయణకు గుండెపోటు వచ్చింది. దీంతో బైక్‌పై నుంచి ఒక్కసారిగా కిందపడిపోయాడు. అక్కడే ప్రాణాలు వదిలారు. ఈ విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు.