రాయికోడ్, జూన్ 13 : బావిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన న్యాల్కల్ మండలం ముంగి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఏడుకొండలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తెనుగు అంజయ్య(25) ఆదివారం రాయికోడ్‌లో ఉన్న తన అక్క ఇంటింకి వెళ్లాడు.
అనంతరం బయటకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, సోమవారం ఉదయం గ్రామ పంచాయతీ బావిలో అంజయ్య శవంగా తేలాడు. మృతిని తల్లి సంగమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.