సంగారెడ్డి : ఐపీఎల్ బెట్టింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెట్టింగ్లో నష్టపోయిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం చింతల్ ఘాట్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ప్రశాంత్ కుమార్ (21) అనే యువకుడు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించి అప్పుల పాలయ్యాడు.
చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపం చెంది గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి నర్సింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చల్లా రాజశేఖర్ తెలిపారు.