న్యాల్కల్ : కాళేశ్వరం జలాలను సంగమేశ్వర, ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతంలోని సాగు భూములకు నీరు అందించి సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్యరావు, నియోజకవర్గ సీఎం జన సమీకరణ సమన్వయకర్త దేవి ప్రసాద్ అన్నారు.
శుక్రవారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలతో మండలంలో 22 వేల ఎకరాల కు సాగునీరు లభించనుందన్నారు.
ఈ పథకాలను శంకుస్థాపన చేసేందుకు ఈ నెల 21న నారాయణఖేడ్ కు సీఎం కేసీఆర్ రానున్నారు. మండలం నుంచి పార్టీ కార్యకర్తలు, రైతులను పెద్ద ఎత్తున తరలించేందుకు ప్రజా ప్రతినిధులు నాయకులు కృషి చేయాలన్నారు.
సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, మండల జన సమీకరణ ఇంచార్జ్ ప్రభు గౌడ్, జిల్లా నాయకులు తన్వీర్ హైమద్, ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, జడ్పిటిసి స్వప్న, వైస్ ఎంపీపీ గౌసుద్దీన్, మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, నాయకులు పాండురంగ పాటిల్, పాండురంగారెడ్డి, బస్వరాజ్ పటేల్, నరసింహారెడ్డి, ప్రవీణ్ కుమార్, బక్క రెడ్డి, వెంకట్,శివ స్వామి, ప్రభాకర్ , భూమా రెడ్డి, సర్పంచులు రవికుమార్, మారుతి యాదవ్ ,పీటర్ రాజు మైపాల్, చంద్రన్న, మల్లారెడ్డి, ఎంపీటీసీలు సలీం, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.