Pyaranagar Dumping Yard | గుమ్మడిదల, ఏప్రిల్ 22 : ప్యారానగర్ డంపింగ్యార్డుపై పోరు ఆగదని రైతు జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇవాళ మండలంలోని నల్లవల్లి పంచాయతీ పరిధి ప్యారానగర్ సమీపంలో జీహెచ్ఎంసీతో ఏర్పాటు కాబోతున్న డంపింగ్యార్డు (ఎంఎస్డబ్ల్యూ)ను రద్దు చేయాలని కొనసాగిస్తున్న రిలే నిరాహారదీక్షలు 77వ రోజుకు చేరుకున్నాయి.
నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల్లో రైతు జేఏసీ నాయకులు రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డంపింగ్యార్డు ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడి గ్రామాల ప్రజలు వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్న రైతుల పొట్ట కొట్టొద్దని తెలిపారు.
ఇకనైనా సర్కారు వెంటనే స్పందించి డంపింగ్యార్డు అనుమతులు విరమించుకోవాలని సూచించారు. ఈ దీక్షలో నల్లవల్లి, ప్యారానగర్ రైతు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
Drinking Water | మిషన్ భగీరథపై అధికారుల నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపు కరువు
Kollapur Mangos | కొల్లాపూర్ మామిడి రైతులను ఆదుకోవాలి : బీఆర్ఎస్ నాయకులు అభిలాష్ రావు
Rayapol ZPHS | విద్యా వెలుగులకు నెలవై.. రాయపోల్ పెద్ద బడికి నేటికి 60 వసంతాలు