కార్మికుల పక్షపాతి ‘టీఆర్ఎస్కేవీ’ : ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
పటాన్చెరు, మే 27 : కార్మికుల పక్షపాతి టీఆర్ఎస్కేవీ అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని పెన్నార్ ఇండస్ట్రీస్‌లో వేతన ఒప్పందం కుదిరింది. టీఆర్ఎస్కేవీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పరిశ్రమ యజమాన్యంతో జరిగిన చర్చల్లో కార్మికులకు రూ. 5,200 వేతనం పెంచేందుకు యజమాన్యం ఒప్పుకుంది.
కాగా, కార్మికుల తరఫున ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, టీఆర్ఎస్కేవీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, అడ్వయిజర్ కిష్టయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ యదగిరియాదవ్, కంపెనీ ప్రతినిధులు డైరెక్టర్ లావణ్యకుమార్, హెచ్ఆర్ మేనేజర్ సత్య నారాయణలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగాఅన్ని రకాల పెండింగ్ బకాయిలతో పాటు, సర్వీస్ వేయిటేజీ, వేరియబుల్ పర్ఫామెన్స్ అలవెన్స్ రూ.100లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది.
ఎడ్యుకేషన్ లోన్ రూ. 30వేలు ఇచ్చేందుకు, రెండున్నర లక్షల రూపాయల విలువైన హెల్త్ ఇన్సూరెన్స్ చేయించెందుకు అంగీకరించారు. వీటితో పాటు పలు రకాల బెనిఫిట్స్‌కు యజమాన్యం అంగీకరించింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెన్నార్‌లో గతంలో కంటే ఇప్పుడు చారిత్రాత్మక ఒప్పందం కుదిరిందన్నారు. కార్మికుల న్యాయమైన కోరికలను తీర్చేందుకు యజమాన్యంతో పోరాడి ఒప్పందం చేసుకున్నామన్నారు.
ఈ ఒప్పందంతో కార్మికులకు రూ. 5,200 వేతనం పెరిగిందన్నారు. కార్మికుల మొహాల్లో అనందం చూడాలనేది తమ లక్ష్యం అన్నారు. టీఆర్ఎస్కేవీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు మాట్లాడుతూ కార్మికులకు ఏ కష్టం వచ్చిన తాను అందుబాటులో ఉంటానన్నారు. పెన్నార్ యజమాన్యం తమ డిమాండ్లను ఒప్పుకోవడంపై హర్షం వ్యక్తి చేశారు. టీఆర్ఎస్కేవీ కార్మికుల హక్కులను కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

