Farmers Awareness | జహీరాబాద్, ఏప్రిల్ 7 : మండలంలోని రంజోల్ గ్రామాన్ని ఇవాళ శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన రావెప్ కార్యక్రమంలో భాగంగా గగ్రామంలో సామాజిక సంస్థలు, వనరులు, నేల రకాలు, పంటపొలాలు, పశువులు, వివిధ సమస్యలపై నేలపై చిత్ర పటాలను ప్రదర్శించారు.
చార్టుల ద్వారా వాటి ఆవశ్యకతతోపాటు అధునిక వ్యవసాయ విధానం, నాణ్యమైన విత్తనాలతో పంటల సాగు, సేంద్రియ ఎరువుల వినియోగం, అశించే తెగుళ్ల, చీడపురుగుల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామ రైతుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన సూచనలు, సలహాలు, జాగ్రత్తలను వివరించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి ప్రదీప్‌కుమార్, కళాశాల విద్యార్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.