మునిపల్లి,మార్చి 27 : తల్లిదండ్రులను వదిలి హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ప్రతి విద్యార్థి చదువుపై ప్రత్యేక దృష్టి పెడుతూ తల్లిదండ్రుల కలలను నేరవేర్చే విధంగా ముందుకు సాగాలని మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ సూచించారు. గురువారం మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సైబర్ క్రైమ్‌పై అవగహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ నాయక్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సైబర్ క్రైమ్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. అపరిచితుల ఫోన్స్, మెయిల్స్‌కు స్పందించి పాస్వార్డు ఎవరికి షేర్ చేయొద్దన్నారు. విద్యార్థులు చెడు వ్యాసనాలకు అలవాటు పడకుండా ఉన్నత చదువుల వైపు సాగాలన్నారు. నేటి సమజంలో చదువుంటేనే తగిన గుర్తింపు లభిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది తదితరులు ఉన్నారు.