పటాన్చెరు/పటాన్చెరు టౌన్, మార్చి 5: తెలంగాణ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని, వారికి ప్రోత్సహిస్తే అద్భుతాలు చేస్తారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని మైత్రి మైదానంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ప్రియాంక ఆలెతో కలసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధు లు, మహిళా నాయకులతో రెండు రోజుల పాటు క్రీడ లు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే సతీమణి యాదమ్మ, సింధు ఆదర్శ్‌రెడ్డి, ఆర్సీపురం కార్పొరేటర్ పుష్పనగేశ్ యాదవ్ టీమ్‌ల మధ్య పోటీతో సంబురాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మ హిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడం తెలంగాణలోనే కనిపిస్తున్నదన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబార క్, కేసీఆర్ కిట్లు, డ్వాక్రా సంఘాలకు రుణాలు అందజేసి సీఎం కేసీఆర్ వారికి అండగా నిలుస్తున్నారన్నారు.
పోటీల్లో గెలుపొందిన వారికి ఈనెల 8న బహుమతులు అందజేస్తామన్నారు. బాలికలను ప్రోత్సహించి చక్కగా చదివించాలని జోనల్ కమిషనర్ ప్రియాంక సూచించా రు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్‌కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, ఎంపీపీలు సుష్మశ్రీ, ఈర్ల దేవానందం, జడ్పీటీసీలు సుప్రజా వెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, బొల్లారం మున్సిపల్ చైర్మన్ రోజా బాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, అంతిరెడ్డి, షకీల్, వెంకట్‌రెడ్డి, విజయ్‌కుమార్, రవీందర్, తహసీల్దార్ మహిపాల్‌రెడ్డి, ఎంఈవో పీపీ రాథోడ్, అధికారులు పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి కృషి
నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అమీన్పూర్ మండలం పటేల్‌గూడ గ్రామంలోని సూర్యోద య కాలనీలో నిర్మిస్తున్న నాగలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. పటేల్‌గూడలో ఎంపీపీ దేవానంద్ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణాలు చేపట్టి ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెల 25న విగ్రహా ప్రతిష్ఠ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గంగుల సుధాకర్‌రెడ్డి, సర్పంచ్ ఈర్ల నితీషా శ్రీకాంత్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.