సంగారెడ్డి, మార్చి 5: తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించి గ్రామాలను అద్దంలా తీర్చిదిద్దుతున్నదని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డి మం డల పరిధిలోని నాగపూర్, ఇరిగిపల్లి, కలబ్గూర్, కులబ్గూర్, ఫసల్‌వాడీ, గౌడిచర్ల, హనుమాన్‌నగర్ పంచాయతీల్లో రూ.85 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించే సీసీ రోడ్డు పనులను ఎంపీ, టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు. కలబ్‌గూర్‌లో కొలువుతీరిన కాశీవిశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హనుమాన్‌నగర్‌లో మొక్కలునాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి నియోజక అభివృద్ధికి మంత్రి హరీశ్‌రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌తో కలిసి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే నిధులు మంజూరు చేశారన్నారు. ఉపాధి హామీ పథకం నుంచి నియోజకవర్గానికి రూ.8 కోట్లను కేటాయించినట్లు తెలిపారు.
కలబ్గూర్లోని కాశీవిశ్వేశ్వరాలయం, నందికంది శివాలయం, కొండాపూర్‌లోని మ్యూజియం అభివృద్ధికి కేంద్ర పురావస్తుశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఆలయాలు, మ్యూజియాన్ని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌లు అమృత, రత్నమ్మ, మంజులా పండరిగౌడ్, సాజిదా బేగం, నిర్మల, మోహన్ సింగ్ నాయక్, లక్ష్మి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, జడ్పీటీసీ సునీత మనోహర్‌గౌడ్, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, ఎంపీపీ లావణ్య, రైతు సమన్వయ సమితి కన్వీనర్ శ్రీనివాస్‌రావు ఎంపీటీసీలు మౌనిక, శారదా సుధాకర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌లు ఆశం అలీ, రవితేజ, ఎంపీడీవో ఆకుల రవీందర్, ఎంపీవో మహేందర్‌రెడ్డి, పీఆర్ డిప్యూటీ ఇంజినీర్ తులసీరాం నాయక్, ఏఈ మాధవరెడ్డి, టీఆర్ఎస్ మండల, పట్టణాధ్యక్షులు చక్రపాణి, వెంకటేశ్వర్లు, మధుసూదన్‌రెడ్డి, చిల్వరి ప్రభాకర్, కాసాల రాంరెడ్డి, అశోక్, సాయన్న, శ్రీనివాస్ ముదిరాజ్, వీరన్న, సాగర్, రమేశ్‌గౌడ్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
జ్యోతిర్వాసు విద్యాపీఠంలో సిద్ధాంతిని కలిసిన ఎంపీ
భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీకైలాస ప్రస్తారా మహామేరు పంచముఖ ఉమామహేశ్వరాలయలాన్ని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సందర్శించారు. శనివారం సంగారెడ్డి మండలంలో ఉపాధిహామీ పథకం నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు, మురికి కాలువల పనుల శంకుస్థాపనకు విచ్చేసిన ఎంపీ ప్రభాకర్‌రెడ్డి జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్మాణం చేస్తున్న ఆలయాన్ని సందర్శించి మహేశ్వరశర్మ సిద్ధాంతి ఆశీస్సులు పొందారు. ఆలయ నిర్మాణానికి తవంతుగా ఆర్థిక సాయం అందజేస్తామనని ఎంపీ హామీ ఇచ్చారు. అనంతరం సిద్ధాంతి ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలకు శాలువాలతో సన్మానించి, ప్రసాదాలు అందజేశారు.