రామచంద్రాపురం, మార్చి 2: భారతీనగర్ డివిజన్లోని బొంబాయికాలనీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో మంగళవారం రాత్రి శివపార్వతుల కల్యాణమహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భ క్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన శివలింగం సెట్టింగ్ భక్తులను ఆకట్టుకున్నది. ఆలయానికి వచ్చిన భక్తులకు పండ్లు పంపిణీ చేశారు.
గుమ్మడిదలలో..
మండల కేంద్రంలో శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. గుమ్మడిదల చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, పంచాయతీ పాలకవర్గం సంయుక్తంగా శివపార్వతుల కల్యాణాన్ని నిర్వహించారు. బొంతపల్లి-వీరన్నగూడెంలోని శరభలింగేశ్వరస్వామి ఆలయంలో శివభక్తులు జ్యోతిర్లింగ మహాదివ్యపడి పూజ నిర్వహించారు. అనంతరం లిం గోద్భవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మద్దుల బాల్‌రెడ్డి, సర్పంచ్ చిమ్ముల నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
పటాన్చెరులో
పటాన్చెరు మహాదేవుని ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరిగిన క ల్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. బుధవారం జరిగిన కల్యాణోత్సవంలో వేదపండితులు కల్యాణం జరిపారు. ఎమ్మెల్యే దంపతులను వేదపండితులు ఆశీర్వదించారు.
పటాన్చెరు మండలంలో
ముత్తంగి, చిట్కుల్, లక్డా రం, బండ్లగూడ పరిధిలోని శివాలయాలను ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సందర్శించి పూజలు చేశారు. ముత్తంగిలో జరిగిన పూజల్లో ఎమ్మెల్యేను ఎంపీటీసీ గడీల కుమార్‌గౌడ్ ఘనంగా సత్కరించారు. లక్డారంలో జరిగిన పూజల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
కవేలి మహాలింగ సంగమేశ్వరాలయంలో
కవేలి మహాలింగ సంగమేశ్వరాలయం లో మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకొని పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, సర్పంచ్ జగదీశ్వర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ యాదవరెడ్డి పాల్గొన్నారు.
సిద్ధేశ్వర్ ఆలయంలో
సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణం వైభవంగా జరిపించారు. జహీరాబాద్ సిద్ధేశ్వర్ దేవాలయంలో పల్లకీ సేవా కార్యక్రమం నిర్వహించి వేదపండితులు పార్వతీ పరమేశ్వరుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదేయ శాఖ కార్యనిర్వహణ అధికారి పీ మోహన్‌రెడ్డి, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
బుధేరా చౌరస్తాలో
బుధేరా చౌరస్తాలో భ్రమరాంబ మల్లి కార్జునస్వామి ఆలయంలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి కల్యాణం వేదపండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు రామమూర్తి-నాగేశ్వరి దంపతుల సమక్షంలో ఆలయ అర్చకుడు అయ్యప్పస్వామి భ్రమరాం బ మల్లికార్జునస్వామి కల్యాణం కనుల పండువగా జరిపించారు. కార్యక్రమంలో ఎంపీపీ శైలజాశివశంకర్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, భక్తులు ఉన్నారు.
వైభవంగా మల్లికార్జునుడి కల్యాణం
బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర రెండో రోజు కొనసాగింది. భ్రమరాంబ మల్లికార్జునుడి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ తులసిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి దంపతులతోపాటు స్థానికులు సతీసమేతంగా పెద్ద ఎత్తున కల్యాణంలో పాల్గొన్నారు.
పట్టు వస్ర్తాలు సమర్పించిన ఎమ్మెల్యే సతీమణి
భ్రమరాంబ మల్లికార్జునుడికి ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సతీమణి యాదమ్మ పట్టు వస్ర్తాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శశిధర్, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, వైస్ చైర్మన్ నందారం నర్సింహ్మగౌడ్, కౌన్సిలర్లు కవితా శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణ తదితరులు ఉన్నారు.