కొండాపూర్, ఫిబ్రవరి 28 : సీఎం కేసీఆర్ దేశానికే దిక్సూచి కానున్నారని సంగారెడ్డి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సోమవారం కొండాపూర్ మండలంలోని గారకూర్తి రూ.10 లక్షలు, కొండాపూర్‌లో రూ.10 లక్షలు, మాచేపల్లి రూ.20 లక్షలు, తేర్పోల్ రూ.10 లక్షలు, మల్లేపల్లి గ్రామా ల్లో రూ.15 లక్షలతో సీసీరోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 33 పనులకు 1.90 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. ఈ పనులను ఈ నెల 25లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు అభివృద్ధిలో తెలంగాణను ముందు ఉంతున్నారన్నారు. సంగారెడ్డి నియోజకవర్గానికి రూ.8.5 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. నారాయణఖేడ్‌లో జరిగిన సభలో సీఎం కేసీఆర్ ప్రతి గ్రామానికి రూ.20లక్షలు మం జూరు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. సదాశివపేట మున్సిపాలిటీకి రూ.25 కోట్లు, సంగారెడ్డికి రూ.50కోట్లు, జహీరాబాద్‌కు రూ.50 కోట్లు మంజూరు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
పల్లె ప్రగతి కింద సీహెచ్ కోనాపూర్ గ్రామానికి రూ. 80.47 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. పంచాయతీ రోడ్ల కింద 13 పనులకు రూ.4కోట్లు మం జూరయ్యాయన్నారు. సంగారెడ్డి నియోజకవర్గానికి రూ. 40కోట్లు అదనంగా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు కోరినట్లు తెలిపారు. పెద్దాపూర్ నుంచి అనంతసాగర్ వరకు రూ.1.23 కోటితో పనులు చేపడుతామన్నారు. గొల్లపల్లి నుంచి కొండాపూర్ వరకు అదనంగా రూ.50 లక్షలు మంజూరు అయ్యాయన్నారు. మల్కాపూర్ నుంచి మహితాబ్ఖాన్ గూడ వరకు రూ.5 కోట్లతో బీటీ రోడ్డు పనులు పూర్తైనట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాం లో బెత్తెడు రోడ్డును కూడా వేయలేరన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడపడుచులకు తండ్రి, మేనమామలా రూ.1లక్ష 16 డబ్బులు అందించడం సంతోషకరమన్నారు.
సం గారెడ్డి నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కొండా పూర్ ఎంపీపీ మనోజ్‌రెడ్డి, జడ్పీటీసీ పద్మావతి, వైస్ ఎంపీపీ లక్ష్మి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రుక్ముద్దీన్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మ్యాకం విఠల్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మల్లేశం, సర్పంచ్‌లు శివలీల, హేమలత, రాములు, ప్రకాశం, మాజీ సర్పంచులు రామాగౌడ్, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు మల్లాగౌడ్, నగేశ్, సత్యనందం, ప్రభాకర్, మోహన్‌గౌడ్, శ్యాంరావు, రాంచందర్ పాల్గొన్నారు.