జహీరాబాద్, ఫిబ్రవరి 22 : జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమని, సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. మంగళవారం జహీరాబాద్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నారాయణఖేడ్ బహిరంగ సభలో నిధులు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. జహీరాబాద్ మున్సిపల్‌కు రూ.50 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన నిధులతో గ్రామాల రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను జహీరాబాద్ నియోజకవర్గానికి తరలించడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. సమావేశంలో జహీరాబాద్ పట్టణ, మండల అధ్యక్షులు మొహినొద్దీన్, ఎంజీ రాములు, టీఆర్ఎస్ నాయకులు రవికిరణ్, తన్వీర్, నర్సింహులు, రంజోల్ సత్యనారాయణ, కిషన్ పవార్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం..
జహీరాబాద్ మున్సిపల్, గ్రామ పంచాయతీలకు సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జహీరాబాద్ పట్టణంలోని భవానీ మందిర్ చౌరస్తాలో ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.