నారాయణఖేడ్, ఫిబ్ర వరి 21: సమైక్య పాలన లో వెనుకబడిన ప్రాం తంగా ఉన్న నారాయణ ఖేడ్ నియోజకవర్గం తె లంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ద యతో అన్ని రంగాల్లో అ భివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. విద్య, వైద్య సదుపాయాలు ఎంతో మెరుగుపడ్డాయని, ఎనిమిది కొత్త చెరువులను మం జూరు చేశారన్నారు. 70 ఏండ్లుగా గోస పడుతున్న ఇక్కడి రైతుల బాధలను గు ర్తించి సీఎం కేసీఆర్ బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసి, పనులు ప్రారంభించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ పథకం పూర్తయితే నియోజకవర్గంలోని 1.31 లక్షల ఎకరాలకు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరో 30 వేల ఎకరాలకు సాగు నీరందిస్తున్నందుకు ఎమ్మెల్యే, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నారాయణఖేడ్ మండలంలోని నిజాంపేట్ కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరగా, సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.
ఎత్తిపోతల గొప్ప పథకం
దేశంలోనే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు చాలా గొప్పవి. ఎత్తిపోతలతో నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాల రూపురేఖలు మారనున్నాయి. రైతులు సాగునీటి కోసం ఎంతో కాలంగా కష్టాలు పడ్డారు. కానీ, సీఎం కేసీఆర్ రైతులు అడగకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి వ్యవసాయనికి సాగునీటిని అందిస్తున్నారు.
మెడికల్, నర్సింగ్ కాలేజ్ మంజూరు చేసినందుకు రుణపడి ఉంటాం: చింతాప్రభాకర్
సంగారెడ్డికి మెడికల్, నర్సింగ్ కాలేజ్ మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు సంగారెడ్డి ప్రజలు రుణపడి ఉంటారని మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతాప్రభాకర్ అన్నారు. అదే విధంగా సంగారెడ్డి నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలు తీర్చేందుకు సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల ఏర్పాటు చేస్తునందుకు రైతుల పక్షాన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ అడిగిన వెంటనే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. జిల్లాలో మెడికల్ ,నర్సిగ్ కాలేజీలు ఏర్పాటు జరిగి, ప్రతీ ఒక్కరికి మెరుగైన వైద్యం అందుతుందని, ఎంతో మందికి సంగారెడ్డి ఉపాధి మార్గంగా మారుతుందన్నారు.
– జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్
ఎత్తిపోతలతో సస్యశ్యామలం..
సంగమేశ్వర ఎత్తిపోతల పథకంతో జహీరాబాద్ నియోజకవర్గంలోని వ్యవసాయ భూములు సస్యశ్యామలం అవుతాయి. జహీరాబాద్ ప్రాంతం సముద్ర మట్టానికి 650 మీటర్ల ఎత్తులో ఉంది. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న మేడిగడ్డ నుంచి కాళేశ్వరం నీరు సరఫరా చేయడం సంతోషంగా ఉంది. కాళేశ్వరం నీరు జహీరాబాద్ నియోజకవర్గానికి తెచ్చేందుకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రజలు, రైతులు జీవితాంతం రుణపడి ఉంటారు.
– కొనింటి మాణిక్‌రావు, జహీరాబాద్ ఎమ్మెల్యే