అందోల్, ఫిబ్రవరి 18: ఈ నెల 21న నారాయణఖేడ్‌లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరిగే సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం, బహిరంగ సభలకు అందోల్-జోగిపేట మున్సిపల్‌తో పాటు అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు హాజరుకావాలని సీఎం సభ నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ అన్నారు. శుక్రవారం మం డల ఇన్చార్జి వెంకటేశంగౌడ్‌తో కలిసి తాడ్మనూర్, అక్సాన్‌పల్లి, బ్రాహ్మణపల్లి, తాలెల్మ, నేరడిగుంట, కన్సాన్పల్లి, ఎర్రారం, రంసాన్పల్లి, కిచ్చన్నపల్లి, దానంపల్లి, అన్నాసాగర్, పోసానిపేట్ గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశం నిర్వహించి సీఎం పర్యటన విజయవంతంపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడి ప్రాంతం అభివృద్ధి కోసం వస్తున్న సీఎం కేసీఆర్‌కు పెద్ద సంఖ్యలో ఘనంగా స్వాగతించడం మన బాధ్యతన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా తమ గ్రామం, వార్డుల పరిధిలోని, నాయకులు, ప్రజలను సభకు తరలించాలన్నారు. సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోత ల పథకం అని, ఇది పూర్తిచేస్తే నియోజకవర్గంలో రైతులకు సా గునీటి ఇబ్బందులు శాశ్వతంగా తొలిగిపోతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలయ్య, జడ్పీటీసీ రమేశ్, రైతుబంధు అ ధ్యక్షుడు అశోక్, జిల్లా సభ్యులు జగన్మోహన్రెడ్డి, సర్పంచ్ లింగాగౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ నారాయణ,సోషల్ మీడియా కన్వీనర్ శంకర్‌గౌడ్ పాల్గొన్నారు.
సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలి
ఈ నెల 21న నారాయణఖేడ్‌లో నిర్వహించే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయికుమార్, అల్లం నవాజ్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని చిన్నచెల్మెడ, బోడపల్లి, తక్కడపల్లి, అల్లాపూర్, అంతారం తదితర గ్రామాల్లో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బహిరంగ సభకు దండులా తరలిరావాలి
సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు దండులా తరలిరావాలని రాయికోడ్ మండల టీఆర్ఎస్ ఇన్చార్జి మురళీయాదవ్ కోరారు. రాయికోడ్‌లో ఏర్పాటు చేసిన పార్టీ మండల స్థాయి ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ కృషితో జిల్లాలో బసవేశ్వర, సంగమేశ్వర్ ఎత్తి పోతల పథకాల పనులను ప్రారంభిస్తారన్నారు. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. 10 వేల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు సమావేశానికి వచ్చేలా పార్టీ శ్రేణులు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. సమావేశంలో జడ్పీటీసీ మల్లికార్జున్‌పాటిల్, మండల కో-ఆప్షన్ సభ్యుడు అబెదాలి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బస్వరాజుపాటిల్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, వరం వైస్ చైర్మన్ తుకారాం, రాయికోడ్ ఏఎంసీ వైస్ చైర్మన్ మారుతి, సర్పంచ్, ఎంపీటీసీలు ఉన్నారు.
సీఎం సభను విజయవంతం చేయాలి
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని మనూరు మండల పార్టీ అధ్యక్షుడు విఠల్‌రావు అన్నారు. మనూరులో ఆయా గ్రామాల పార్టీల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మండల రైతు బంధు అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, సర్పంచ్ శివాజీరావు, నాయకులు నాగేందర్రావు, నర్సింహులు పాల్గొన్నారు.