పటాన్చెరు, ఫిబ్రవరి 18 : ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశ కార్యకర్తలకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తోందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయం త్రం క్యాంపు కార్యాలయం ఆవరణలో పటాన్చెరు మండలం లో విధులు నిర్వహిస్తున్న 62 మంది ఆశ కార్యకర్తలకు ఎమ్మె ల్యే చేతుల మీదుగా స్మార్టు ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయి లో అందిస్తున్న వైద్య, ఆరోగ్య సేవలను ఎప్పటికప్పుడు స్మార్ట్ ఫోన్లలో నిక్షిప్తం చేసి ప్రభుత్వానికి సకాలంలో నివేదికలు అం దించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. కార్యక్రమం లో ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్‌రెడ్డి, జడ్పీటీసీ సుప్రజా వెం క ట్‌రెడ్డి, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు హారికా విజయ్‌కుమార్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆరోగ్యశాఖ బలోపేతం..
రామచంద్రాపురం, ఫిబ్రవరి18: పేదలకు మెరుగైన వైద్యం అందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖను పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తున్నదని ఆర్సీపురం డివిజన్ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పానగేశ్ అన్నారు. శుక్రవారం డివిజన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేసే 17మంది ఆశ వర్కర్లకు ప్ర భుత్వం పంపిణీ చేసిన స్మార్ట్ ఫోన్లను కార్పొరేటర్ వారికి అందజేశారు. ఆరోగ్యశాఖకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయడానికి ఆశ వర్కర్లకు ప్రభు త్వం స్మార్ట్ ఫోన్లను అందజేస్తున్నదన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నాగరాజకుమారి, సిబ్బంది ఉన్నారు.
మల్లన్న జాతరకు ఏర్పాట్లు..
డివిజన్లోని మయూరినగర్లో భ్రమరాంబ మళ్లికార్జున స్వామి జాతర ఆదివారం జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం ఆలయ పరిసరాలను కార్పొరేటర్ పుష్పానగేశ్ బల్దియా సిబ్బందితో శుభ్రం చేయించారు. శ్రీనివాస్‌నగర్‌కాలనీ 3వ బ్లాక్‌లో శుక్రవారం ఉదయం పారిశుధ్య పనులను కార్పొరేటర్ పుష్పానగేశ్ పర్యవేక్షించారు. శనివారం మంత్రి హరీశ్‌రావు ఆర్సీపురంలో బస్తీ దవాఖానను ప్రారంభించనున్న నేపథ్యంలో పరిసరాలను శుభ్రం చేయించాలని ఆమె సిబ్బందికి సూచించారు.
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని పటాన్చెరు ఎ మ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బండ్లగూడ గ్రామంలో నిర్వహిస్తున్న శివాలయ వార్షికోత్సవాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్ ఆధ్వర్యంలో శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి ప్రభు త్వం పెద్ద పీట వేస్తున్నదని అన్నారు. ప్రత్యేక రాష్టం ఏర్పడిన తర్వాత ఆలయాల అభివృద్ధికి విశేషంగా నిధులు కేటాయిస్తున్నదన్నారు. అందుకు యాదాద్రి ఆలయ అభివృద్ధే నిదర్శనమన్నారు. ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను, ప్రజాప్రతినిధుల ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మె ట్టు కుమార్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారికా విజయ్‌కుమార్, డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ అఫ్జల్, కాలనీవాసు లు పాల్గొన్నారు.