పటాన్చెరు, ఫిబ్రవరి 17 : పురాతన ఆలయాలను పునర్నిర్మిస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండలం పాశమైలారం నూతనంగా నిర్మించనున్న పోచమ్మ తల్లి దేవాలయానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం గ్రామ నడిబొడ్డున శివాజీ విగ్రహం ఏర్పాటుకు పూజలు చేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోచమ్మ తల్లి దేవాలయం నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలో పురాతన ఆలయాలను అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పాశమైలారం గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సుష్మశ్రీ, జడ్పీటీసీ సుప్రజావెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, రుద్రారం సర్పంచ్ సుధీర్‌రెడ్డి, ఉపసర్పంచ్ కృష్ణయాదవ్ పాల్గొన్నారు.
కనుల పండువగా మల్లికార్జునస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన..
మండలంలోని కానుకుంటలో నూతనంగా నిర్మించిన మల్లికార్జునస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు కనుల పండువగా నిర్వహించారు. గురువారం మల్లికార్జునస్వామి దేవతామూర్తుల విగ్రహాలను ఆశ్రమ పీఠాధిపతి గురుమాధవానంద సరస్వతీ ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హాజరై మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలు ప్రశాంతత నిలయాలుగా మారుతున్నాయన్నారు. ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రవీణారెడ్డి, జడ్పీటీసీ కు మార్‌గౌడ్, వైస్ ఎంపీపీ మంజులగౌడ్, మం డల అధ్యక్షుడు మహ్మద్ హుస్సేన్, మాజీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు కొత్తపల్లి ప్రభాకర్‌రెడ్డి, పార్వతమ్మ పాల్గొన్నారు.