సంగారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 17 : తెలంగాణ స్ఫూర్తి ప్రదాత సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సంబురాలు పండగ వాతావరణంలో జరిగాయి. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉంటూ రాష్ర్టానికి మరెన్నో సంక్షేమ ఫలాలు అందించాలని కోరుకుంటూ సంగారెడ్డి పట్టణంలోని భవానీ మాత ఆలయంలో చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మెథడిస్ట్ చర్చి, ఫతేఖాన్ దర్గాలో పార్టీ శ్రేణులు ప్రార్థనలు చేశారు. పాత బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో మదీనా చౌరస్తా వద్ద సంబురాలు నిర్వహించారు. ఈ సంబురాల్లో చింతా ప్రభాకర్ పాల్గొని కేక్ కట్ చేసి పేదలకు బట్టలు అందజేశారు. అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్లో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన సందర్శించారు. సంబురాల్లో భాగంగా స్టేడియం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కేక్‌ను చింతా ప్రభాకర్ కట్ చేశారు. ఐబీ అతిథి గృహంలో డీజే సౌండ్స్ ఏర్పాటు నాయకులు, కార్యకర్తలు చిందులేశారు. ఐబీలో కేక్ కట్ చేసి భారీ ఎత్తున పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీఎం కేసీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో సం బురాల్లో పాల్గొన్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తెలంగాణ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో చింతా ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. జిల్లా పరిషత్‌లో జడ్పీ చైర్పర్సన్ ముంజుశ్రీజైపాల్రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ ఆవరణలో మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా భారతీనగర్, ఆర్సీపురం డివిజన్లతోపాటు తెల్లాపూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకొన్నారు.
భారతీనగర్ డివిజన్లో కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డి, ఆర్సీపురం డివిజన్లో కా ర్పొరేటర్ పుష్పానగేశ్ వేర్వేరుగా పార్టీ శ్రేణులు, విద్యార్థుల మధ్య కేక్ కట్ చేశారు. సదాశివపేటలోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు. అనంతరం ఈశ్వర్ మందిరం, ముర్షద్ దర్గా, చర్చిలో ప్రత్యే క ప్రార్థనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లతావిజయేందర్‌రెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశం, ప్రధాన కార్యదర్శి నర్సింహులు, మాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.