నారాయణఖేడ్, ఫిబ్రవరి 14 : నిరుపేద ఆడపిల్లల తల్లిదండ్రులకు కల్యాణలక్ష్మి పథకం భరోసానిస్తున్న దని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం సిర్గాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపిల్లల పెండ్లిళ్లు తల్లిదండ్రులకు భారంగా కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి రూ.1లక్ష 116 అందజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సిర్గాపూర్ ఎంపీపీ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ రాఘవరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంజీవ్‌రావు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నల్లవాగు, బసవేశ్వరపై సమీక్ష
సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్టు అతిథి గృహంలో సోమవారం ఎమ్మెల్యే నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో బసవేశ్వర ఎత్తిపోతల పథకం, నల్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులపై సమీక్ష నిర్వహించారు. నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లోని 1.65 లక్షల ఎకరాలకు సాగునీరందించే బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరైట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పథకం డిజైనింగ్‌తో పాటు కెనాల్ నిర్మాణం, ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం పొందుతున్న గ్రామాలు, భూసేకరణ తదితర అంశాలపై ఎమ్మెల్యే, అధికారులతో చర్చించారు. నల్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు రూ.24 కోట్లు మంజూరు కాగా, ఆయా పనులను ప్రారంభించే విషయమై అధికారులతో ఎమ్మె ల్యే సమీక్షించారు. సమావేశంలో నీటిపారుదలశాఖ సీఈ జయకుమార్, ఎస్ఈ మురళీధర్, నారాయణఖేడ్ ఈఈ జైభీమ్, డిప్యూటీ ఈఈలు జలంధర్, పవన్‌కుమార్, విజయ్‌కుమార్, ఏఈఈలు రవి, జగత్ప్రభ ఉన్నారు.