పటాన్చెరు, జనవరి 29: ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు మండలంలోని కర్ధనూర్, ఘనపూర్, పాటి, పోచారం, బచ్చుగూడెం, రామేశ్వరంబండ, ఇంద్రేశం, ఐనోలు, చిన్నకంజర్ల గ్రామాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు ఆయన గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మండల కేంద్రం నుంచి గ్రామాలకు రోడ్లు వేయడంతో వేగవంతంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. పటాన్చెరు మండలంలోని అన్ని గ్రామాల్లో ఇప్పుడు కొత్త వెలుగులు కనిపిస్తున్నాయన్నారు. ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడంతోపాటు బ్రిడ్జీలు ఏర్పాటు చేసి వర్షాకాలంలో రాకపోకలు సజావుగా జరిగేలా చేశామన్నారు. గ్రామ పంచాయతీల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా సీసీ రోడ్లు వేస్తున్నామన్నారు. నియోజకవర్గానికి రూ. 5కోట్ల 60లక్షల రూపాయాలు మంజూరయ్యాయని, వాటిలో పటాన్చెరు మండలంలోనే రూ. 2కోట్ల 40లక్షలు ఖర్చు చేసి సీసీ రోడ్లు వేస్తున్నామన్నారు. జడ్పీటీసీ సుప్రజావెంకట్‌రెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీ, సర్పంచ్‌లు భాగ్యలక్ష్మి, కావ్యాకాశిరెడ్డి, రవీందర్, జగన్, అంతిరెడ్డి, నర్సింహులు, రాజ్‌కుమార్, ఎంపీటీసీలు భిక్షపతి, నాగజ్యోతి లక్ష్మణ్, కర్ధనూర్ ఉప సర్పంచ్ వడ్డేకుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, దశరథరెడ్డి, వెంకట్‌రెడ్డి, కాశిరెడ్డి, అంతిరెడ్డి, సత్యనారాయణ, ఎంపీడీవో బన్సీలాల్ పాల్గొన్నారు.