సంగారెడ్డి, జనవరి 28 : జిల్లాలకు టీఆర్ఎస్ నూతన అధ్యక్షులను సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం సం గారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకంఅయిన చింతా ప్రభాకర్ హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ను మంత్రి కేటీఆర్ శాలువాకప్పి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమ్మ కం ఉంచి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి, మఠం భిక్షపతి ఉన్నారు.
నిధులు మంజూరు చేయండి..
అందోల్-జోగిపేట మున్సిపల్ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్‌ను కలిసి విన్నవించినట్లు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.10 కోట్లు అవసరమవుతాయని, అందుకు వెంటనే నిధులు మంజూరు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం సంగారెడ్డి, మెదక్ జిల్లాల పార్టీ నూతన అధ్యక్షులుగా నియామకమైన చింతాప్రభాకర్, పద్మాదేవేందర్ రెడ్డికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట జాగృతి కార్యదర్శి భిక్షపతి తదితరులు ఉన్నారు.