బొల్లారం, ఆగస్టు 16: ప్రతి ఇంటికీ సీఎం కేసీఆర్ పెద్ద కొడుకులా వెన్నంటి ఉంటున్నాడని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం బొల్లారం మున్సిపల్లోని పాత కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతనంగా మంజూరైన 246 ఆసరా పింఛన్ల పత్రాలను ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర భార త 75వ వజ్రోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభు త్వం 57ఏండ్లు నిండిన వారికి ఆసరా పింఛన్లు మంజూ రు చేసిందని తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలో సంక్షేమ స్వర్ణయుగం నడుస్తోందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ రోజాబాల్రెడ్డి, కమిషనర్ రాజేంద్రకుమార్, టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి, మున్సిపల్‌శాఖ అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమానికి ‘ఆసరా’
వృద్ధులకు, దివ్యాంగులకు, వితం తు మహిళలకు, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్లు అందజేయడంతో సీఎం కేసీఆర్ పెద్దన్న పాత్ర పోశిస్తున్నారని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అన్నారంలో అర్హులైనా 43మంది పేదలకు ఆసరా పిం ఛన్ల లబ్ధిదారులకు, అనంతారం గ్రామానికి చెందిన 5మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో బడుగుబలహీన వర్గాలకు సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నారని తెలిపారు. ప్రతి నెల అర్హులైనా లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అందజేస్తు వారి జీవనో ఉపాధికి తోడ్పాటు అందిస్తున్నారన్నారు. దేశ చరిత్రలో ఆసరా పింఛన్లు చరిత్రాత్మకంగా మారాయన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుమార్‌గౌడ్, తుపా కు ల రాజు, మండల అధ్యక్షుడు మహ్మద్‌హుస్సేన్, సోషల్ మీడి యా అధ్యక్షుడు ఫయాజ్, కార్మిక సెల్ నాయకుడు నరహరి, గ్రామకమిటీ అధ్యక్షుడు రుక్మారెడ్డి, నల్లవల్లి, నాగిరెడ్డిగూడెం సర్పంచ్‌లు శంకర్, హన్మంత్‌రెడ్డి, నాయకులు బాలకిషన్, అన్నారం, అనంతారం ఉపసర్పంచ్లు మురళీ, స్వరూప లక్ష్మణ్, రాము, శ్రీకాంత్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
అర్హులందరికీ ఆసరా పింఛన్లు
ఇచ్చిన మాటకు కట్టుబడి అర్హులం దరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు మంజూరు చేసిందని మునిపల్లి ఎంపీపీ శైలజాశివశంకర్, జడ్పీటీసీ మీనాక్షిసాయి కుమార్ తెలిపారు. మంగళవారం మండలంలోని అల్లాపూర్ లో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆదేశాల మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా పింఛన్లను పింఛన్‌దార్లకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభు త్వం అర్హులైనా వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్లు అందిస్తుందన్నారు. అర్హులైన లబ్ధిదారులు సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్, ఎంపీడీవో రమేశ్ చంద్రకులకర్ణి, సర్పంచ్ నాగరాణి, నాయకులు శివశంకర్, చంద్ర య్య, నారాయణ, సంగమేశ్వర్ ఉన్నారు.
అర్హులందరికి సంక్షేమ పథకాలు
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. అండూరు, గడ్డపోతారం గ్రామాల్లో లబ్ధిదారులకు మంగళవా రం ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలను సర్పంచులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని సీఎం కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతాయన్నారు. జిన్నారం మండలంలో 2614 పింఛన్లు ఉండగా మరో 444 పింఛన్లు మం జూరయ్యాయన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచ్‌లు ఖదీర్, ప్రకాశ్‌చారి, ఎంపీడీవో రాము లు, ఎంపీటీసీ జనాబాయి, మాజీ సర్పంచ్ నీరడి శ్రీనివాస్, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.