సదాశివపేట, జూలై 22: దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నా రు. శుక్రవారం మండలంలోని నందికందిలో దళితబంధు లబ్ధిదారు గంగోజిపేట మమత ఏర్పాటు చేసుకున్న ‘పావని లేడిస్ ఎంపోరియం’ షాప్‌ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు దళితుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. దళితబం ధును సద్వినియోగం చేసుకుని ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి ఎదుగాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ కుందెన రాజు, సర్పంచ్ల ఫోరం మండ ల అధ్యక్షుడు నవీన్‌కుమార్, ఎంపీటీసీ సునిత సుధాకర్, విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
అన్ని మతాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
అన్ని మతాల సంక్షేమమే ప్ర భు త్వ ధ్యేయమని చింతా ప్రభాకర్ అన్నారు. పట్టణంలోని 3వ వార్డు లో చర్చి నిర్మాణ ప నులను ఆయ న ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణలో అన్ని మతాలను గౌరవిస్తూ ముఖ్యమం త్రి కేసీఆర్ సర్వమత స్థాపనకు కట్టుబడి పని చేస్తున్నారన్నారు. అనంత రం చర్చి ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆయనను ఆశీర్వదించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రకాశ్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి వీరేశం, నాయకులు పాల్గొన్నారు.