పటాన్చెరు, జూలై 22 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో విద్యారంగంలో తీసుకొచ్చిన వినూత్న సంస్కరణల మూలంగా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభు త్వ విద్యా సంస్థలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భానూరులో బీడీఎల్ సంస్థ సౌజన్యంతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక వసతులతో పాఠశాల భవనాన్ని నిర్మించడం సంతోషకరమన్నారు. పాఠశాల భనన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించిన బీడీల్ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీడీఎల్ సంస్థ సీఎండీ సిద్ధార్థమిశ్రా, ఈడీ రఘునాథ్‌రెడ్డి, ప్రధాన్మిశ్రా, ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్‌రెడ్డి, జడ్పీటీసీ సుప్రజా వెంకట్‌రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నా యకులు దశరథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధు లు వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కార్మికుల సంక్షేమానికి కృషి
పటాన్చెరు, జూలై22: ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం అన్నారు. శుక్రవారం పాశామైలారం పారిశ్రామికవాడలో టెంపుల్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ ఆవరణలో ఏర్పా టు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం యాజమాన్యాలకు అనుకూలమైన కార్మిక చట్టాలను తీసుకురావడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల రక్షణకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. అర్హులైన ప్రతి కార్మికుడికీ ప్రభుత్వ పథకాల అమలులో ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు ఎమ్మెల్యేను సన్మానించా రు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర కార్యదర్శి, మా జీ ఎంపీపీ యాదగిరియాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకట్‌రెడ్డి, మధుసూధన్‌రెడ్డి, మేరాజ్‌ఖాన్, పాశమైలారం ఉప సర్పంచ్ కృష్ణ, కార్మిక సంఘం ప్రతినిధులు అర్జున్, మహేష్, మాధవరావు పాల్గొన్నారు.
జడ్జి కార్యలయాలను ఏర్పాటు చేయాలని వినతి
జిన్నారం, గుమ్మడిదల, హత్నూ ర మండలాలు, బొల్లారం మున్సిపాలిటీలోని పోలీస్ స్టేషన్లో ఉన్న కేసుల పరిష్కారానికి జిన్నారం కేంద్రంగా జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ జూనియర్ సివిల్ కోర్టును ఏర్పా టు చేసేలా చొరవ తీసుకోవాలని న్యాయవాదులు ఎమ్మె ల్యేని శుక్రవారం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. జిన్నారం, గుమ్మడిదల, హత్నూర, బొల్లారం పోలీస్ స్టేషన్లలో దాదాపు రెండువేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని న్యాయవాదులు తెలిపారు. ఈ నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో జిన్నారం మండల కేంద్రం కోర్టు ఏర్పాటుకు అనుకూలంగా ఉందన్నారు. కోర్టు పనుల కోసం సంగారెడ్డి వెళ్లాల్సి వస్తోందని, దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యేకు విన్నవించారు.
గతంలో జిన్నా రం ఎంపీపీ రవీందర్‌గౌడ్ జిన్నారంలో జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని ఇచ్చారని, జిన్నారంలో మేజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని న్యాయవాదులు తెలిపారు. న్యాయశాఖ అధికారులను కలిసి కోర్టు ఏర్పాటు విషయం చర్చిస్తామని, కోర్టు ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కూడా జిన్నారంలో కేటాయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, న్యాయవాదులు అంజిరెడ్డి, జాఫర్, శ్రీనివాస్‌గౌడ్, ప్రకాశ్, శ్రీనివాస్, శ్రీనివాస్‌రావు, సత్యనారాయణ, శ్రీధర్‌రెడ్డి, సుధాకర్, బాలకిషన్, రాజు ఉన్నారు.