పటాన్చెరు/ పటాన్చెరు టౌన్, జూలై 19: బీజేపీ నేతలు అగ్వకు నౌకరీలు చేయమంటున్నారు, యువశక్తిని నిర్వీర్యం చేసేందుకు అగ్నిపథ్ వంటి తాత్కాలిక ఉద్యోగాలు సృష్టిస్తున్నారు. దేశంలో నింపాల్సిన 16.50 లక్షల ఉద్యోగాలను నింపాలనే ఆలోచన బీజేపీ నాయకులకు కొరవడిందని తెలంగాణ ఆర్థికమంత్రి, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సొంత నిధులతో 33,964 మంది విద్యార్థులకు అందిస్తున్న 2,27లక్షల నోట్‌బుక్స్ పంపణీ కార్యక్రమాన్ని మంత్రి కలెక్టర్ డాక్టర్ శరత్‌తో కలిసి ప్రారంభించారు. ఇదే వేదికపై రూ.70 లక్షలతో 410మంది విద్యార్థులకు 90 రోజుల పాటు ఇచ్చిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని శిక్షణార్ధులకు జాబ్స్ సాధించాలని, తెలంగాణకు, మీ ఎమ్మెల్యేకు, కుటుంబ సభ్యులకు పేరు తీసుకురావాలని సూచించారు.
అనంతరం పటాన్చెరు ఏరియా దవాఖానలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ యంత్రాన్ని మంత్రి ప్రారంభించి, దవాఖానను తనిఖీ చేశారు. రోగులతోనూ మంత్రి మాట్లాడారు. అమీన్‌ఫూర్ పట్టణంలో బస్తీ దవాఖానను మంత్రి ఎమ్మెల్యేతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగాల విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రాన్ని పార్లమెంట్లో నిలదీయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇవ్వాల్సిన 16.50 లక్షల ఉద్యోగాల ఊసు లేదని మంత్రి ఎద్దేవా చేశారు. ఏం ముఖం పెట్టుకుని మీరు గ్రామాల్లో తిరుగుతారని ప్రశ్నించారు. చేసింది ఏమీ లేదు.. చేసేది ఏమీ లేదని బీజేపీ నేతలనుద్దేశించి అన్నారు.
ఉద్యోగాలు ఇస్తున్నది తెలంగాణ..
ఉద్యోగాలు ఇస్తున్నది తెలంగాణ అయితే, ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నది బీజేపీ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీజేపీ 50వేల బీఎస్ఎన్ఎల్ ఉద్యోగాలను తొలగించిందన్నారు. 16.50 లక్షల ఉద్యోగాలు నింపాల్సి ఉన్నా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మ్ రిజర్వ్‌లో 3లక్షల ఉద్యోగాలున్నాయని గుర్తు చేశారు. అవి నింపితే తెలంగాణ యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. మిలటరీలో చేరాలనే మీలాంటి యువత ఆశలపై నీళ్లు చల్లారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిపథ్ పేరిట యువత జీవితాలతో కేంద్రం ఆటలాడుతున్నదని, యువత శక్తిని నిర్వీర్యం చేసున్నదని మండిపడ్డారు. కులం, మతం పేరున చిచ్చు పెట్టి లబ్ధిపొందాలనే యోచనే తప్ప మరొకటి ఏమీ లేదన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరులో 90రోజుల పాటు నిర్వహించిన ఉచిత శిక్షణను మంత్రి కొనియాడారు. ఖర్చుకు వెనుకాడకుండా అన్ని రకాల వసతులను కల్పిస్తున్నారన్నారు.
గతంలో ఇచ్చిన శిక్షణలో అద్భుతమైన జాబ్స్ వచ్చాయని మంత్రి ఎమ్మెల్యేను అభినందించారు. ఈసారి కూడా అధికశాతం మందికి జాబ్స్ రావాలని ఆకాంక్షించారు. 2లక్షలకు పైగా నోట్‌బుక్స్ పంపిణీ చేయడం గొప్ప విద్యాదానం అని మంత్రి అన్నారు. ఎమ్మెల్యే పటాన్చెరులో చేస్తున్న సేవా కార్యక్రమాలు సిద్దిపేటలోనూ అమలు చేయాలని ఉన్నదన్నారు. స్థానిక యువతకు ఉద్యోగాలు రావాలని సీఎం కేసీఆర్ 95శాతం ఉద్యోగాలు రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఇప్పుడు 91వేల ఉద్యోగాలు మీకు రాబోతున్నాయని, అందరూ బాగా చదివి ఉద్యోగాలు సాధించాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, రాజర్షి షా, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్, డీఎస్పీ భీమ్‌రెడ్డి, ఎంపీపీలు సుష్మశ్రీవేణుగోపాల్‌రెడ్డి, దేవానందం, వినయభాస్కర్రెడ్డి, జడ్పీటీసీలు సుప్రజావెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, కుమార్‌గౌడ్, కార్పొరేటర్లు మెట్టు కుమార్‌యాదవ్, పుష్పానగేశ్, సింధూఆదర్శ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, యాదగిరియాదవ్, తహసీల్దార్ మహిపాల్‌రెడ్డి, ఎంఈవో పీపీ రాథోడ్, ఎంపీడీవో బన్సీలాల్, సీఐ వేణుగోపాల్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్యయాదవ్, సీనియర్ నాయకులు మధుసూదన్‌రెడ్డి, దశరథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, షకీల్, అక్రమ్‌పాషా, అంతిరెడ్డి, పరమేశ్‌యాదవ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే..: పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే తాను సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ 91వేల జాబ్స్ ప్రకటించడంతో వాటిలో అధికశాతం ఇక్కడి యువత సాధించాలని ఆలోచించి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. పోలీస్ అధికారుల సహకారంతో, గోపీ అకాడమీ శిక్షణతో యువత ట్రైనింగ్ అయ్యారన్నారు. గతంలో 310 మంది శిక్షణ పొందితే 262మంది సర్కార్ కొలువులు సాధించారన్నారు. నియోజకవర్గంలోని ప్రతి సర్కార్ బడిలో ఉచితంగా నోట్ పుస్తకాలు అందజేయాలని తన లక్ష్యం అన్నారు. 2.27 లక్షల బుక్స్‌ను అందజేస్తున్నామన్నారు. పటాన్చెరులో ఏర్పాటైన సీటీ స్కాన్‌తో రోగులకు మేలు జరుగుతుందన్నారు. ఇప్పటికే సీఎస్సార్ నిధులతో ఎన్నో సౌకర్యాలు కల్పించామని తెలిపారు.
సేవలు స్ఫూర్తిదాయం..: కలెక్టర్ డాక్టర్ శరత్
తాము చదివే సమయంలో ఇలాంటి ప్రోత్సాహం లేదని కలెక్టర్ శరత్ అన్నారు. నేడు ఎమ్మెల్యే నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం, విద్యార్థులకు నోట్‌బుక్స్ ఇవ్వడం మంచి కార్యక్రమం అన్నారు. చక్కగా చదువుకుని అందరూ ప్రయోజకులు కావాలని కలెక్టర్ సూచించారు.
సీటీ స్కానింగ్ సెంటర్ ప్రారంభం
పటాన్చెరు ఏరియా దవాఖానలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీటీ స్కానింగ్ కేంద్రాన్ని మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీటీ స్కానింగ్ యంత్రం సేవలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏరియా దవాఖానలోని బాలింతల వార్డులను పరిశీలించారు. తల్లిబిడ్డల ఆరోగ్యాలను, దవాఖానలో అందుతున్న సేవలను వారినే అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కిట్ అందజేశారా.? అని ఒక మహిళలను అడిగారు. ఇంకా ఇవ్వలేదని బాలింతతో ఉన్న తల్లి చెప్పడంతో మంత్రి దవాఖాన సూపరింటెండెంట్ వసుంధరను ప్రశ్నించారు. ఇంటికి వెళ్లే సమయంలో కిట్ అందిస్తామని డాక్టర్ చెప్పడంతో మంత్రి అలా చేయవద్దని, బయట నుంచి వారు చిన్నారికి కావాల్సిన సామగ్రి కొని తెచ్చుకున్నారని చూపించారు. మనం ఇచ్చే కేసీఆర్ కిట్ తక్షణం ఉపయోగపడితేనే మన సేవలు ప్రజలకు అర్థం అవుతాయని మంత్రి పేర్కొన్నారు. అనంతరం దవాఖానలో డెలివరీలు, సిబ్బంది సంఖ్యపై ఆరా తీశారు. గత నెల 114 డెలివరీలు అయ్యాయని చెప్పడంతో మంత్రి డెలివరీలు పెంచాలని సూచించారు.
వైద్య సేవలకు వందకు వంద మార్కులు వేస్తా: మంత్రితో ఓ మహిళ
ఈ సందర్భంలో లక్ష్మి అనే మహిళను డాక్టర్ల, సిబ్బంది సేవలకు ఎన్ని మార్కులు వేస్తావని మంత్రి ప్రశ్నించారు. ఆమె సార్.. నేను పెద్దగా చదువుకోలేదు. నాది మహబూబ్‌నగర్ జిల్లా, నా కూతుర్లు, నా మనవరాళ్లు కూడా ఇక్కడే కాన్పులు చేయించుకున్నారు. ఇప్పుడు నాకు మనవరాలు పుట్టిందని తెలిపింది. డాక్టర్లకు వందకు వంద మార్కులు వేస్తానని చెప్పడంతోపాటు కేసీఆర్ కిట్ ఇవ్వడంపై, సీఎం కేసీఆర్ స్కీంలను ఆమె కొనియాడింది. తన బిడ్డ పెండ్లి సమయంలో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి అందుకున్నదని సంతోషంగా చెప్పింది. ఆమె మాటలకు మంత్రి హరీశ్‌రావు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి తక్షణం కేసీఆర్ కిట్‌ను తెప్పించి అందజేశారు.
బీజేపీ నేతలు అగ్వకు నౌకరీలు చేయమంటున్నారు, యువశక్తిని నిర్వీర్యం చేసేందుకు అగ్నిపథ్ వంటి తాత్కాలిక ఉద్యోగాలు సృష్టిస్తున్నారు. దేశంలో నింపాల్సిన 16.50 లక్షల ఉద్యోగాలను నింపాలనే ఆలోచన బీజేపీ నాయకులకు కొరవడిందని తెలంగాణ ఆర్థికమంత్రి, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సొంత నిధులతో 33,964 మంది విద్యార్థులకు అందిస్తున్న 2,27లక్షల నోట్‌బుక్స్ పంపణీ కార్యక్రమాన్ని మంత్రి కలెక్టర్ డాక్టర్ శరత్‌తో కలిసి ప్రారంభించారు. ఇదే వేదికపై రూ.70 లక్షలతో 410మంది విద్యార్థులకు 90 రోజుల పాటు ఇచ్చిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని శిక్షణార్ధులకు జాబ్స్ సాధించాలని, తెలంగాణకు, మీ ఎమ్మెల్యేకు, కుటుంబ సభ్యులకు పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం పటాన్చెరు ఏరియా దవాఖానలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ యంత్రాన్ని మంత్రి ప్రారంభించి, దవాఖానను తనిఖీ చేశారు. రోగులతోనూ మంత్రి మాట్లాడారు. అమీన్‌ఫూర్ పట్టణంలో బస్తీ దవాఖానను మంత్రి ఎమ్మెల్యేతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగాల విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రాన్ని పార్లమెంట్లో నిలదీయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇవ్వాల్సిన 16.50 లక్షల ఉద్యోగాల ఊసు లేదని మంత్రి ఎద్దేవా చేశారు. ఏం ముఖం పెట్టుకుని మీరు గ్రామాల్లో తిరుగుతారని ప్రశ్నించారు. చేసింది ఏమీ లేదు.. చేసేది ఏమీ లేదని బీజేపీ నేతలనుద్దేశించి అన్నారు.