సంగారెడ్డి, జూలై 19 : సంగారెడ్డి జిల్లా కేంద్రం ఆస్తబల్ రేణుకా ఎల్లమ్మకు మంగళవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు నిర్వహించారు. ప్రభుత్వ ఐటీఐ పక్కన కల్లుడిపో నుంచి గౌడ కులానికి చెందిన మహిళలు బోనాలతో ప్రధాన రహదారి మీదుగా ఎల్లమ్మ ఆలయానికి చేరుకున్నారు. గౌడన్నలు వృత్తి వేషధారణతో దున్నపోతులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గౌడ సంఘం నాయకులు బోనాల ఊరేగింపు ఎదుట ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు శోభాయాత్రలో పాల్గొన్నారు. ఎల్లమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
పూజలు చేసిన మంత్రి హరీశ్‌రావు
సంగారెడ్డిలోని రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రికి ఆలయ అర్చకులు పగిడి తొడిగించి శాలువా కప్పి స్వాగతం పలికారు. ప్రజలందరూ ఆయురార్యోగాలతో ఉండాలని ప్రార్థించారు. వర్షాలు పుష్కలంగా పడి తాగు, సాగు నీటి కొరత రాకుండా ప్రజలను కాపాడాలని వేడుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీ రవి, వైస్ చైర్పర్సన్ లతా విజయేందర్‌రెడ్డి, వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్(నాని), మాజీ కౌన్సిలర్ చంద్రశేఖర్, గౌడ సం ఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.