సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ, మే 5: ఇంటర్మీ డియట్ పరీక్షలు శుక్రవారంనుంచి ప్రారంభం కానున్నా యి. పరీక్షా కేంద్రంలోకి ఒక నిమిషం ఆలస్యమైనా అను మతించేది లేదని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తు న్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగనున్నది. విద్యార్థులు ఉదయం 8.15 గంటల వరకు సంబంధిత పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. కాగా, మే 6వ తేదీ నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 47 పరీక్షా కేంద్రా లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 47 మంది చీఫ్ సూప రింటెండెంట్లు, 47 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 589 మంది ఇన్విజిలేటర్లు, 23 ఏసీఎస్, 10 కస్టోడియన్స్, 2 ఫ్లైయింగ్ స్కాడ్, 4 సిట్టింగ్ స్కాడ్ బృందాలను నియ మించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై విద్య, వైద్య, రెవెన్యూ, విద్యుత్, పోలీసు, ఆర్టీసీ, పోస్టల్ తదితర శాఖల అధికారులతో ఇప్పటికే జిల్లా అదనపు కలెక్టర్ వీరా రెడ్డి సమీక్షించిన విషయం తెలిసిందే.
మే 6నుంచి 19వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్ పరీక్షలు సజావుగా జరిగేలా ఆయా శా ఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన స్పష్టం చేశారు. పోలీసు స్టేషన్లలో భద్రపరుస్తున్న ప్రశ్నా పత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు, సెక్యూరిటీ ఏర్పాటు చేయడంతో పాటు, పరీక్షా కేంద్రాలకు అవస రమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లలో అధికారులు నిమ గ్నమయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలని ఇప్పటికే ఆదే శాలు జారీ చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద థర్మల్ స్కానర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లతో ఏఎన్ ఎంలను అందుబాటులో ఉంచేవిధంగా వైద్యాధికారులు సమాయత్తమ య్యారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ అదనంగా బస్సులు నడిపేందుకు నిర్ణయించింది.
పరీక్షలు రాయనున్న 32,655 మంది విద్యార్థులు
జిల్లాలో మొత్తం 32,655 మంది విద్యార్థులు ఇంట ర్మీడియట్ పరీక్షలు రాయనున్నారు. మొదటి సంవత్స రంలో 17,193 మంది పరీక్ష రాయనుండగా, జనరల్ కే టగిరీలో 15,777 మంది, ఒకేషనల్ కేటగిరీలో 1,416 మంది విద్యార్థులు ఉన్నారు. ద్వితీయ సంవత్సరానికి సం బంధించి 15,462 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, జనరల్ కేటగిరీలో 14,251 మంది, ఒకేషనల్ కేటగిరీలో 1,211 మంది విద్యార్థులున్నారని ఇంటర్మీడి యట్ అధికారి గోవింద్రామ్ వివరించారు.
పకడ్బందీ ఏర్పాట్లు
మెదక్ జిల్లాలో పరీక్షలు పకడ్బం దీగా నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. రెండేండ్లుగా కరోనా నేపథ్యంలో వార్షిక పరీక్షలు నిర్వహిం చకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. ఈసారి పరీక్షలు నిర్వహించి మెరుగైన ఫలితాలు సాధించ డమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మే 6న ఫస్టియర్, మే 7వ తేదినుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
పరీక్షలు రాయనున్న 13,777 మంది విద్యార్థులు
మెదక్ జిల్లాలో 58 కళాశాలలు ఉండగా ప్రభుత్వ కళా శాలలు 16, ప్రైవేట్ కళాశాలు 18 ఉన్నాయి. మిగతావి కస్తుర్భా, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వేల్ఫేర్, మైనారిటీ కళాశా లలు ఉన్నాయి. 13,777 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో ఇంటర్మీడియట్ ప్రథమ సంవ త్సరం జనరల్ విద్యార్థులు 6,619 మంది, ద్వితీయ సం వత్సరం జనరల్ విద్యార్థులు 6,032 ఉన్నారు. ఒకేషనల్ కోర్సులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 486 మంది, ద్వితీయ సంవత్సరపు 640 మంది ఉన్నారు. ఈ పరీక్షల కు జిల్లా వ్యాప్తంగా 31 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 15 పరీక్ష కేంద్రాలు, 2 మోడల్ పాఠశాలలో, 1 సాంఘిక సంక్షేమ గురుకు పాఠశాలలో, 1 గిరిజన గురుకుల పాఠశాలలో, 12 కేంద్రాలు ప్రైవేట్ పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రతి పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్‌తో పాటు డిపార్ట్మెంటల్ అధికారి ఉంటారు. మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రా న్లలో కస్టోడియన్లను ఏర్పాటు చేశారు.
హైపవర్ కమిటీ..
పరీక్షల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లా ఎస్పీ, ఇంటర్మిడీయట్ రిజీయన్ డైరెక్ట్, జిల్లా ఇంటర్ నోడల్ అధికారి సభ్యులుగా ఉంటారు.
టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలి
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా 18005999333 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయవచ్చు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేం ద్రాలకు చేరుకోవాలి. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే చర్య లు తప్పవు.
– గోవింద్ రామ్,జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, సంగారెడ్డి