నారాయణఖేడ్, ఏప్రిల్ 18: నారాయణఖేడ్ మండలం పంచగామ గ్రామంలో సోమవారం గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గొర్రెకాపర్లకు 17 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆత్మ చైర్మన్ రాంసింగ్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు మహారెడ్డి రోషన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ ఎస్ ప్రభుత్వం కులవృత్తులకు అండగా నిలుస్తున్నదన్నారు. 75 శాతం సబ్సిడీపై కాపర్లకు గొర్రెలను పంపిణీ చేయడం ద్వారా గొల్ల కుర్మల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేయూతనందిస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియో గం చేసుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు రవీందర్‌నాయక్, కల్హేర్ జడ్పీటీసీ నర్సింహారెడ్డి, ఎంపీటీసీ విఠల్, నాయకులు అంజాగౌడ్, నర్సింహులు, సాయిలు, సాయిరెడ్డి పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత
నారాయణఖేడ్ మండలం అనంతసాగర్‌కు చెందిన ఇద్దరు కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు సోమవారం మహారెడ్డి రోషన్‌రెడ్డి చేతుల మీదుగా రూ. లక్షా 116 చెక్కులను అందజేశారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి సహకారంతో పార్టీలకతీతంగా, పారదర్శకంగా వేలాదిమందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారన్నారు.
సుల్తానాబాద్‌లో
సుల్తానాబాద్‌లో లబ్ధిదారులకు గొర్రె పిల్లలను జడ్పీటీసీ మల్లగారి రాఘవరెడ్డి, ఎంపీపీ జారా మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే తనయుడు, టీఆర్ఎస్ యువ నేత రోషన్రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. సుల్తానాబాద్, సిర్గాపూర్, చీమల్పాడ్ గ్రామాలకు కలిపి మొత్తం 15 గొర్రె పిల్లల యూనిట్లను పంపిణీ చేశామని ఎంపీపీ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ గంగామణినర్సింహులు, వైస్ ఎంపీపీ ప్రయాగబాయిమాధవరావు, ఎంపీటీసీ ప్రేమల, లబ్ధిదారులు ఉన్నారు.
ముర్కుంజాల్లో
టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల వారిని ఆదుకుంటున్నదని కంగ్టి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగా రాం అన్నారు. ముర్కుంజాల్లో 13 మందికి ప్రభుత్వం రెం డో విడుతలో భాగంగా మంజూరు చేసిన గొర్రెలను రైతుబంధు మండలాధ్యక్షుడు కోట ఆంజనేయులుతో కలిసి పం పిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటున్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు సాయాగౌడ్, జాగృ తి మండలాధ్యక్షుడు కురుమ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.