సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 12: ముసాయిదా ఓట రు జాబితాలపై అభ్యంతరాలను ఈ నెల 16లోగా అందజేయాలని కలెక్టర్ హనుమంతరావు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ముసాయిదా ఓటరు జాబితా తయారీ, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ స్థానిక సంస్థల్లో వివిధ కారణాలతో ఖాళీ ఏర్పడిన స్థానాలకు ఎన్నికల నిర్వహణకు సంసిద్ధతలో భాగంగా వార్డుల వారిగా, గ్రామ పంచాయతీల వారీగా తయారు చేసిన డ్రాప్ట్ ముసాయిదా ఓటర్ల జాబి తాను ఆయా గ్రామ పంచాయతీలు, వార్డుల్లో ప్రదర్శించినట్లు తెలిపారు. ఓటర్ల జాబితాపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే ఈ నెల 16వరకు తెలియజేయాలని రాజకీయ పార్టీల నాయకులను కోరారు. ప్రజల నుంచి వచ్చి న అభ్యంతరాలను పరిశీలించి ఏప్రిల్ 19వరకు పరిష్కరించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఏప్రిల్ 21న తుది ఓటరు జాబితా నోటిఫై చేస్తారని పేర్కొన్నారు. జిల్లాలో 11సర్పంచ్ స్థానాలు, 91 వార్డు మెంబర్ స్థానాలు, 2ఎంపీటీసీలు, 2మున్సిపాలిటీ వార్డు స్థానాలు ఖాళీ గా ఉన్నాయని కలెక్టర్ వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి గా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజర్షషా, జడ్పీ సీఈ వో ఎల్లయ్య, డీపీవో సురేశ్‌మోహన్ ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
వివిధ కారణాలతో స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన ఆయా పదవుల భర్తీ కోసం తయారు చేసిన ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే తెలపాల్సిందిగా జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. మంగళవారం తన ఛాంబర్లో వివి ధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో వివిధ కారణాతో ఆకస్మికం గా ఖాళీ అయిన ఒక జడ్పీటీసీ, 5 ఎంపీటీసీలు, సర్పంచ్, 73వార్డు సభ్యుల స్థానాలకు త్వరలో జరుగబోవు ఎన్నికలకు సన్నద్ధంగా ఉండుటకు ముసాయిదా ఓటర్ల జాబితాను రూ పొందించామని అన్నా రు. అట్టి ముసాయిదా ఓటర్ల జాబితాను వారికి అందజేస్తూ వార్డుల వారీగా, గ్రా మ పంచాయతీల వారీగా తయారు చేసిన జాబితా ను గ్రామ పంచాయతీల్లో, మండల ప్రజాపరిషత్, జిల్లా పంచాయతీ శాఖ కార్యాలయంలో నోటీసు బోర్డులపై ప్రదర్శించామన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై ఏవేని అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉన్నచో ఈ నెల 16లోగా సంబంధిత మండల అధికారులకు తెలియజేయాల్సిందిగా ఆయన కోరారు. ఏప్రిల్ 21న తుది జాబితా విడుదల చేస్తామని రమేశ్ తెలిపారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్‌కుమార్, జడ్పీ డిప్యూటీ సీఈవో సుభాషిణి పాల్గొన్నారు.