సంగారెడ్డి, ఏప్రిల్ 10: సమాజాభివృద్ధికి అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 10వ వార్డులోని శిల్ప వెంచర్లో మల్లేశం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో చింతా ప్రభాకర్, ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. సంగారెడ్డి మండలంలోని కోత్లాపూర్ గ్రామంలో పవన్‌కుమార్ అధ్యక్షతన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమన్నారు. మహనీయుల జయంతులు ఒకే నెలలో జరుపుకోవడం సంతోషకరమన్నా రు. 58, 59 జీవోలతో పేదలు సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి నిర్మాణ హక్కులు కల్పిస్తామన్నారు. ప్రతి ఇంటికి భగీరథ పథకంతో నల్లా నీటిని సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు. మురుగు కాల్వలు, రోడ్ల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసి, పనులు పూర్తి చేస్తామన్నారు. విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు ఏర్పా టు చేస్తామన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుకరిస్తూ దేశానికి సేవలందించాలన్నారు.
మహనీయులను స్మరించుకోవాలి
అంబేద్కర్ జీవితాన్ని దేశ సేవలకు అంకితం చేశాడన్నారు. అన్ని వర్గాలు, అన్ని మతాలు సమానమని రాజ్యాంగంలో పొందుపర్చారని తెలిపారు. సమాజం లో మహిళలకు సమాన హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని, ప్రతిఒక్కరూ గుర్తించుకోవాలని సూచించారు. కళాకారుల బృందం పాడిన పాటలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. స్వర్ణక్క గానంతో ఊర్రూతలూగించింది. కార్యక్రమంలో సర్పంచ్ సందీప్‌రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యమ్, ఎంపీటీసీ సామెల్, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లతా, జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల నర్సింలు, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చక్రపాణి, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, నాయకులు విజయేందర్ రెడ్డి, చిల్వరి ప్రభాకర్, బొంగుల రవి, మనోహర్‌గౌడ్, బీరయ్య యాదవ్, రాజమల్లారెడ్డి, జీతయ్య, గోవర్దన్ పాల్గొన్నారు.