సంగారెడ్డి అర్బన్, ఏప్రిల్ 2 : శుభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలే జరిగి, ప్రజలు సుఖఃశాంతులతో ఉం డాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నట్లు జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పట్లోళ్ల నరహరిరెడ్డి ఆ ధ్వర్యంలో శనివారం సంగారెడ్డి గ్రంథాలయంలో పంచాంగ పఠనం – కవి సమ్మేళనం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ.. సంస్కృతీ సంప్రాదాయాలకు తెలంగాణ పండుగలు ప్రతీక అన్నారు. షడ్రుచుల మా దిరిగా జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కొంటూ ముం దుకుసాగాలన్నారు. చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. శుభకృత్ సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. అన్ని పండుగలను అధికారికంగా నిర్వహిస్తూ, అన్ని మతాలను సమానంగా చూస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. జీవిత గమ్యానికి లక్ష్యం, కార్యాచరణ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు.
పండితుడు బోర్పట్ల హన్మంతచార్యులు పంచాంగ పఠ నం చేసి రాశీ ఫలాలను వివరించారు. కవి సమ్మేళనం ఆకట్టుకుంది. అనంతరం పంచాంగ పఠనం చేసి న హన్మంతచార్యులు, కవులను సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చై ర్మన్ మాణిక్యం, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి, నాయకులు చిల్వేరి ప్రభాకర్, పెరమాండ్ల నర్సిం హులు, మధుసూదన్‌రెడ్డి, వాజిద్, శ్రావన్‌రెడ్డి, జలేందర్, పరరాం, విఠల్, డాక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
‘శుభకృత్’ ఆవిష్కరించిన మాధవానందసరస్వతి
గుమ్మడిదల, ఏప్రిల్ 2 : శుభకృత్ తెలుగు సంవత్సరాది కాలమానిని మధనానంద ఆశ్రమ పీఠాధిపతి మాధవానందసరస్వతి ఆవిష్కరించారు. గుమ్మడిదలలోని కృష్ణానందాశ్రమంలో జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మాధవానందసరస్వతి తెలుగు కాలమానిని ఆవిష్కరించి, ఉగాది పర్వదినం విశిష్టత వివరించారు. కార్యక్రమంలో జిల్లా బ్రా హ్మణ సంఘం అధ్యక్షుడు రామరావుదేశ్పాండే, ప్రధాన కార్యదర్శి వినోద్పటేల్, కోశాధికారి కిషన్‌రావు, సంయుక్తకార్యదర్శి కేఆర్ రావు, శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.