సంగారెడ్డి అర్బన్, మార్చి 28 : అన్ని రకాల వస్తువుల ధరలు పెంచడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పాలన సాగుతున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సోమవారం సంగారెడ్డిలో బైకు ర్యాలీ, బహిరంగ సభను నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన చుక్కా రాములు మాట్లాడుతూ కార్మికుల హక్కులను హరించి పెట్టుబడి దారులకు బానిసలుగా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేయడం దుర్మార్గమన్నారు. కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కేంద్రానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బీరం మల్లేశం, జయరాజు, సాయిలు, యాదగిరి, బాగారెడ్డి, ప్రసన్న, సుధాకర్, నాగరాజు, సువర్ణ, శ్రీనివాస్‌రెడ్డి, వివిధ పరిశ్రల యూనియన్ నాయకులు, కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ
దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని మార్కె ట్ యార్డు నుంచి రాందాస్ చౌరస్తా వరకు సీఐటీయూ అధ్యక్షుడు మల్లేశం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయా జిల్లా అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలకు కార్పొరేట్లకు అప్పగిస్తున్న విధానాలకు స్వస్తి పలకాలన్నారు. ఉపాధి కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.7500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధిహామీ పథకాన్ని పని దినాలు 200 రోజులకు పెంచాలని, రోజు వారి కూలీ రూ.600 ఇవ్వాలన్నారు.
ప్రైవేటీకరణ విధానానికి స్వస్తి పలకాలి
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు కేంద్రం స్వస్తి పలకాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ పేర్కొన్నారు. సోమవారం కేంద్ర ప్రభు త్వం అవలంభిస్తున్న ఉద్యోగ, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమైక్య పిలుపు మేరకు తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. కార్యక్ర మంలో జిల్లా కార్యదర్శి మినికే రాజ్‌కుమార్, నర్సాపూర్ యూనిట్ అధ్యక్షుడు శేషాచారి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాధ, శేఖర్, జగ్జీవన్, హరికృష్ణ, రేణుక పాల్గొన్నారు.