సంగారెడ్డి, మార్చి 26: తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. శనివారం సంగారెడ్డి పట్టణంలోని 27వ వార్డు కౌన్సిలర్ మంజులతా ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మితో కలిసి వార్డులోని శాంతినగర్‌లో పర్యటిస్తూ ప్రజలను సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పట్టణాభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారని, వాటితో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు పర్యటిస్తున్నామన్నారు. ప్రజలు తమ దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో వార్డు ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మున్సిపల్ వైస్ చైర్మన్ లతా, కౌన్సిలర్లు రామప్ప, మనిల మల్లేశం, జీవీ వీణా, విజయలక్ష్మి, అశ్విన్, విష్ణువర్ధన్, శ్రీకాంత్, సోహైల్ అలీ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శలు వెంకటేశ్వర్లు, పెరుమాళ్ల నర్సింలు, మైనార్టీ పట్టణాధ్యక్షుడు అంజాద్, అధికారులు కమిషనర్ చంద్రశేఖర్, డీఈఈ ఇంతియాజ్, ఏఈ శ్రీకాంత్, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, నాయకులు డాక్టరు శ్రీహరి, మాజీ సీడీసీ ప్రభుగౌడ్, జీవీ శ్రీనివాస్‌రావు, చంద్రశేఖర్, నర్సింలు, దిడ్డి విఠల్, ప్రభుగౌడ్, శ్రావణ్‌రెడ్డి, జలేందర్, లక్ష్మణ్, బత్తుల శ్రీనివాస్, యూనూస్, వాజిద్ తదితరులు పాల్గొన్నారు.