సంగారెడ్డి, మార్చి 11 : ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధ్దికి కేటాయిస్తున్న నిధులను ప్రణాళిక ప్రకారం ఉపయోగించుకోవాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సూ చించారు. శుక్రవారం పోతిరెడ్డిపల్లిలోని పీఎస్ఆర్ గార్డెన్లో టీఆర్ఎస్ వార్డు కమిటీల అధ్యక్షులు, సోషల్ మీడియా ఇన్చార్జిలు, వార్డు కౌన్సిలర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 13 నుంచి వార్డు లవారీగా పర్యటించి, స్థానిక సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నారాయణ్‌ఖేడ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని ప్రకటించి, అదేరోజు నిధులకు సంబంధించిన జీవోలు జారీ చేసిన విషయం తెలిసిందేనన్నారు.
సంగారెడ్డి జిల్లాలోని 8 మున్సిపాలిటీలు, 699 పంచాయతీల అభివృద్ధ్దికి నిధులు కేటాయించి, అభివృద్ధ్దిపై సీఎం కేసీఆర్ తన చిత్తశుద్ధిని చాటుకున్నరన్నారు. సంగారెడ్డి గ్రేడ్-1 పురపాలక సంఘానికి రూ.50 కోట్లు, సదాశివపేటకు రూ.25 కోట్ల మంజూరుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పట్టణంలోని ప్రతి వార్డును అభివృద్ధ్ది చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. అభివృద్ధ్ది, సంక్షేమంతో పా టు కార్యకర్తలను కాపాడుకోవడం నా ధర్మమని, అందుకే నామినేటెడ్ పద్ధతిలో అభివృద్ధ్ది పనులు కేటాయిస్తామన్నారు. ఇందుకు వార్డు కమిటీలు, సోషల్ మీడియా ఇన్చార్జిలు, వార్డు కౌన్సిలర్లు సమన్వయంతో పని చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ సహకారం తో నియోజకవర్గాన్ని అభివృద్దిలో తీర్చిదిద్దుతామన్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో పర్యటించి, అత్యవసర పనులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేసుస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లత, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి నర్సింహులు, కౌన్సిలర్లు రామప్ప, విష్ణువర్ధన్, షేక్ సాబేర్, శ్రీకాంత్, పవన్ నాయక్, సోహైల్ అలీ, అశ్విన్ కుమార్, నేతలు బొంగుల రవి, విజయేందర్‌రెడ్డి, హరికిషన్, జీవీ శ్రీనివాస్, విఠల్, ఎన్ఆర్ఐ షకీల్, విఠల్‌రెడ్డి, బత్తుల శ్రీనివాస్, నాగరాజుగౌడ్, ఆంజాద్, వాజిద్, జలేందర్, ప్రవీణ్ కుమార్, అజీమ్, ప్రభుగౌడ్, శర్పోద్దీన్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
కౌన్సిలర్ సోహైల్ అలీ పుట్టినరోజు వేడుకలు
సంగారెడ్డి మున్సిపాలిటీలోని 6వ వార్డు కౌన్సిలర్ సోహైల్ అలీ జన్మదిన సందర్భంగా చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో వేడు కలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తె లిపారు. సోహైల్ ను శాలువా కప్పి, సన్మానించారు. సమావేశానికి హా జరైన నాయకులందరూ కౌన్సిలర్ సోహైల్ అలీ కి పుట్టిన రోజు శు భాకాంక్షలు తెలియజేశారు.