సంగారెడ్డి, మార్చి6: నియోజకవర్గంలో మహిళా బంధు కార్యక్రమాలు తొలి రోజు అట్టసంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ సదాశివపేట మండలంలోని నందికంది గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి సంబురాలు ప్రారంభించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు మూడురోజులు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలో మున్సిపల్లో చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి రాఖీలు కట్టారు. కంద మండల కేంద్రంలో ఎంపీపీ సరళా పుల్లారెడ్డి, సంగారెడ్డి మండలం కలబ్గూర్ సర్పంచ్ మంజుల, కొండాపూర్ మండలం మల్లేపల్లిలో జడ్పీటీసీ పండల పద్మావతి, సదాశివపేటలోని 8వ వార్డు కౌన్సిలర్ మహేశ్వరి ఆధ్వర్యంలో మహిళలు రాఖీలు కట్టారు. అనంతరం ఆశవర్కర్లు, ఏఎన్ఎంలను ఘనంగా సన్మానించారు. మొక్కలు నాటి, కేక్ కట్ చేసి తినిపించారు.
ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో మహిళలకు ప్రత్యేక పథకాలు అమలుచేస్తున్న మఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తుచేశారు. సంబురాల్లో సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ లతా విజయేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు జీవీ.వీణా, విజయలక్ష్మి, స్వప్న, ఉమామహేశ్వరి, శ్రీదేవి, నందికంది సర్పంచ్ కుందేన రాజు, కంది సర్పంచ్ విమల, జడ్పీటీసీలు సునీతా, కొండల్‌రెడ్డి, చింతా గోపాల్, పులిమామిడి రాజు, విద్యాసాగర్‌రెడ్డి, రేష్మా, ముబీన్, మనోహర్‌గౌడ్, మధుసూదన్‌రెడ్డి, ఎంపీటీసీ నందకిషోర్, నాయకులు మోహన్‌రెడ్డి, వీరేశం, పుల్లారెడ్డి, ఆనందరావు, రమేశ్, మహేందర్ యాదవ్, సాజ్జత్, రియాజ్, చక్రపాణి, పండరిగౌడ్, మ్యాకం విఠల్, పాండురంగం, జగదీశ్ పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించడమే ధ్యేయం
సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయమని, వార్డుల్లో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం మూడు రోజుల మహిళా దినోత్సవ సంబురాల్లో భాగంగా పట్టణంలోని 4, 5, 8, 21 వార్డుల్లో ఆయన పర్యటించారు. కేక్ కట్ చేసి, చెట్లు నాటి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 8వ కౌన్సిలర్ వడ్ల మహేశ్వరి ఆధర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ వార్డుల్లో పర్యటించి ప్రజల అవసరాలు తెలుసుకుంటామన్నారు. వాటికి అనుగుణంగా నిధులు కేటాయించి, సమస్యలు పరిష్కరిస్తామన్నారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, నల్లా కనెక్షన్ తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న, ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరశం, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, వడ్ల మహేశ్వరి, రేష్మ, ముబీన్, పులిమామిడి రాజు, కో ఆప్షన్ సభ్యుడు కోడూరి అంజయ్య పాల్గొన్నారు.
జిన్నారంలో..
మహిళలు లేనిది ప్రపంచమే లేద ని అలాంటి వారి సంక్షేమం కోసం వినూత్న పథకాలు ప్రవేశపెడుతూ సీఎం కేసీఆర్ మహిళా బంధువుగా దేశవ్యాప్తంగా పేరు పొందారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నల్తూరు గ్రామంలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా బంధు సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలోని మహిళలు, అంగన్వాడీ, ఆశా కార్యకర్త లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ మహిళల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు తీసుకోచ్చారన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు సబ్సిడీపై రుణాలు అందించడంతో పాటు ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా యూత్ అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, సర్పంచ్ జనార్దన్, పార్టీ మండల అధ్యక్షుడు రాజేశ్, సర్పంచ్‌లు శివరాజ్, ఆంజనేయులు, నాయకులు భీమ్రావు పాల్గొన్నారు.