
సంగారెడ్డి, జూన్ 28 : దీర్ఘకాలికంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న కక్షిదారులు లోక్‌అదాలత్‌తో సత్వర న్యాయం పొందేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించిందని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వచ్చే నెల 10న జాతీయ లోక్‌అదాలత్‌లు ఏర్పాటు చేస్తున్నామని, కోర్టుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతున్న కక్షిదారులు లోక్‌అదాలత్‌ల్లో న్యాయం పొందాలన్నారు. కక్షిదారులు, న్యాయవాదులు, అధికారులు, ప్రజలు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా రాజీ మార్గమే రాజమార్గమనే సత్వర న్యాయం పొందవచ్చన్నారు. సమావేశంలో జిల్లా ఏడవ అదనపు న్యాయమూర్తి కర్ణకుమార్, రెండవ అదనపు న్యాయమూర్తి మైత్రేయి, సీనియర్ సివిల్ జడ్జి పుష్పలత, జిల్లా న్యయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత, అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి కల్పన, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జలీల్, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ కేసులను పరిష్కరించాలి..
జహీరాబాద్, జూన్ 28 : జాతీయ లోక్‌అదాలత్‌లో పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని జహీరాబాద్ జూనియర్ సివిల్ జడ్జి పి.శ్రీదేవి తెలిపారు. సోమవారం జహీరాబాద్ జూనియర్ కోర్టులో న్యాయవాదులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జూలై 10న జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తామని, కక్షదారులు రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. జాతీయ లోక్‌అదాలత్‌లో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, సివిల్, బ్యాంకు, రికవరీ చెక్‌బౌన్స్ కేసులు, భార్యాభర్తల మధ్య వివాదాలకు సంబంధించిన కేసులను పరిష్కరించుకోవాలని తెలిపారు. సమావేశంలో జహీరాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దత్తాత్రేయరెడ్డి, న్యాయవాదులు పాండురంగారెడ్డి, సంతోశ్సాగర్, శ్రీనివాస్‌రెడ్డి, ఎంఏ సమీ తదితరులు పాల్గొన్నారు.
లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించాలి..
వచ్చే నెల 10న నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమంలో అధిక శాతం కేసులను పరిష్కరించేలా చూడాలని సీనియర్ సివిల్ న్యాయమూర్తి సుహాసిని పోలీసులకు, అధికారులకు సూచించారు. జిల్లా న్యాయస్థానం సముదాయంలో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ న్యాయమూర్తి ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. జాతీయ లోక్‌అదాలత్‌లో కేసులను పరిష్కరించేలా చూడాలని, జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు వినియోగించుకునేలా అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ న్యాయమూర్తి లావణ్య, ప్రథమ శ్రేణి న్యాయమూర్తి సాయికిరణ్, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.