TGSRTC | సంగారెడ్డి, జూన్ 10 : ప్రయాణికులను సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చడమే ఆర్టీసీ లక్ష్యమని రీజినల్ రీజియన్ మేనేజర్ విజయ్‌భాస్కర్ అన్నారు. ప్రయాణికులు కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసి ఆర్టీసీని కాపాడాలని విజయ్‌భాస్కర్ సూచించారు. మంగళవారం ఆయన స్థానిక బస్సు డిపోను సందర్శించి ముఖ్యమైన ప్రాంతాలను పరిశీలించారు.
అనంతరం డిపో ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ.. ఆర్టీసీ సిబ్బంది సమిష్టి కృషి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు అభివృద్ధి మూలమని తెలిపారు. బస్సుల్లో ప్రయాణికులు మరిచిపోయిన వస్తువులను విధుల్లో ఉన్న కండక్టర్లు ఆర్టీసీ పై అధికారులకు సమాచారం ఇచ్చి తిరిగి అప్పగించడం మానవతా కర్తవ్యమన్నారు. ఇటీవల నగదు, ముఖ్యమైన విద్యుత్ పరికరాలను పోగొట్టుకున్న ఒక వాహనదారునికి అందజేసి కంట్రోలర్ నిజాయితీని చాటుకున్నారని గుర్తుచేశారు.
విధుల్లో కంట్రోలర్ జనుభాయ్, కండక్టర్ బసవరాజులను సత్కరించామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి వస్తువులు బస్సులో మరిచిపోతే అడ్రసు గుర్తించి వారికి అందజేయాలని ఆర్టీసీ ఉద్యోగులను కోరారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ఉపేందర్, ట్రాఫిక్ మేనేజర్ సువర్ణ భాయ్, ఏఎంఎఫ్ అహ్మద్, వెల్ఫేర్ కమిటీ సభ్యులు రాజమణి, డ్రైవర్స్, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బంది ఉన్నారు.