కంగ్టి, జూన్ 1: జూన్ 3 నుంచి కంగ్టి మండలంలో నిర్వహించే రెవెన్యూ సదస్సులను (Revenue Sadassulu) ప్రతిరైతు వినియోగించుకోవాలని కంగ్టి తహసీల్దార్ భాస్కర్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ భూభారతిలో భాగంగా ఈ నెల 3 నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. తహసీల్దార్, డీప్యూటీ తహసీల్దార్ వారి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు కొనసాగుతాయని చెప్పారు.
ఈనెల 3న జమ్గి(బి), దెగుల్‌వాడి, 4న జమ్గి(కె), భీంరా, 5న ఎంపల్లి, నాగూర్(కె), జూన్ 6న వల్మూర్, నాగూర్(బి), ఈనెల 9న బాన్సువాడ, సిద్దంగిర్గ, 10న దామరిగిద్ద, ఎన్కెమూరి, 11న ఘన్పూర్, రాంతీర్థ్, 12న రాసోల్, నాగన్‌పల్లి, 13న ముర్కుంజాల్, గాజుల్పాడ్, 16న చాప్టా(కె), సుక్కల్తీర్థ్, 17న తుర్కవడగామ, చాప్టా(బి), 18న కంగ్టి, బోర్గి గ్రామాల్లో సదస్సులు ఉంటాయని వెల్లడించారు. రైతులు తమ భూసమస్యలను రెవెన్యూ సదస్సులకు హజరయ్యే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. భూభారతి నూతన చట్టం ద్వారా ఫిర్యాదు అందిన తరువాత గ్రామాల్లో విచారణ చేపట్టిన అనంతరం భూసమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.