
సదాశివపేట : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం ఆపాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తెలంగాణ ఉద్యోగుల సమాఖ్య నూతన కార్యవర్గం ఎన్నిక సందర్భంగా మెదక్ ఎంపీని వారు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో ఉద్యోగులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం సదాశివపేటలో మాజీ ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో ఓడీఎఫ్ తెలంగాణ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కేవీ రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.ప్రభు, వర్కింగ్ ప్రెసిడెంట్ టి.అశోక్, కోశాధికారి భిక్షపతి, కార్యవర్గ సభ్యులు అనంతరాం, భాస్కర్, వెంకటయ్య, అశోక్, వీరేశం, నర్సయ్య, భద్రయ్య, మాజీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, పడాల యాదగిరి పాల్గొన్నారు.