Sangareddy | విద్యార్థులను అకారణంగా శిక్షించిన అధ్యాపకుడి తీరుపై విద్యార్థి సంఘాలు భగ్గమన్నాయి. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం తురకల ఖానాపూర్ శివారులోని రత్నపురి పాలిటెక్నిక్ కళాశాలలో హెచ్ ఓ డి గా విధులు నిర్వహిస్తున్న అధ్యాపకుడు 15 మంది విద్యార్థులను విచక్షణహితంగా కొట్టారు.
దీంతో బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల గేటు ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. అధ్యాపకుడితో పాటు కళాశాలపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రమణారెడ్డి పేర్కొన్నారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళణ విరమించారు.