పటాన్చెరు, జనవరి 24 : రామేశ్వరం పంచాయతీ నూతన పంచాయతీలకు రోల్‌మోడల్‌గా నిలిచిందని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని రామేశ్వరంబండలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ధరణి అంతిరెడ్డిని అభినందించారు. మహిళా సర్పంచ్‌గా ఉంటూ గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిలోకి తీసుకుని వెళ్తున్నారని కొనియాడారు. పంచాయతీ భవనాన్ని అధునాతన, సౌకర్యవంతంగా నిర్మించారని అభినందించారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అభివృద్ధి పనులకోసం శ్రమిస్తారన్నారు. ఎమ్మెల్యేగా దొరకడం పటాన్చెరువాసుల అదృష్టమన్నారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ రామేశ్వరంబండ ఒకప్పుడు వెనుకబడిన గ్రామం అన్నారు. టీఆర్ఎస్ సర్కారు కొత్త పంచాయతీగా గుర్తింపు ఇవ్వడంతోనే గ్రామానికి మహర్దశ పట్టింద న్నారు. వాగుపై వేసిన బ్రిడ్జి గ్రామ స్వరూపాన్నే మార్చిందన్నారు. పంచాయతీ పాలకవర్గం ప్రజాసేవలో ఉం టూ ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. అభివృద్ధి కోసం నిధుల సమస్యలేకుండా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీనిచ్చారు. కార్యక్రమంలో సంగారెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలు సుష్మశ్రీ వేణుగోపాల్‌రెడ్డి, ఈర్లదేవానంద్, జడ్పీటీసీలు సుప్రజావెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్ మహిపాల్‌రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, ఎంపీటీసీలు మన్నెరాజు, పేట మాణెమ్మ, గోల్కొండ లక్ష్మణ్, పాటి సర్పంచ్ లక్ష్మణ్, అంతిరెడ్డి, దశరథరెడ్డి, వెంకట్‌రెడ్డి, విజయ్‌కుమార్, మండల కోఆప్షన్ సభ్యుడు సర్దార్ పాల్గొన్నారు.