గుమ్మడిదల,మే23: ప్యారానగర్ డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా గత 108 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న రైతు జేఏసీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేశారు. శుక్రవారం జహిరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైతున్న సీఎం రేవంత్‌రెడ్డి హాజరైతున్న విషయంతెలిసిందే. దీనికి గాను గురువారం జేఏసీ నాయకులు ప్యారానగర్ డంపింగ్‌యార్డును ఉపసంహరించుకోవాలని సీఎం సభకు వెళ్లి నిరసన చేయాని మండలంలోని నల్లవల్లి జేఏసీ నాయకులు పిలుపు నిచ్చారు.
దీంతో అప్రమత్తమైన గుమ్మడిదల పోలీసులు శుక్రవారం తెల్లవారుజామును నల్లవల్లి చేరుకుని జేఏసీ నాయకులు కుమ్మరి ఆంజనేయులు, కొరివి సురేశ్, మన్నె విజయరామకృష్ణ, పులిమామిడి రవీందర్, రాజుగౌడ్,మిర్యాల చంద్రశేఖర్, శ్రీనివాస్ తదితతరులను పోలీసులు అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు.
ఈసందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్యారానగర్ డంపింగ్‌యార్డును ఉపసంహరించుకోవాలని శాంతియుతంగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న స్పందించని సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు సీఎంసభలో నిరసన చేయాలని పిలుపు నివ్వడంతో వెంటనే స్పందించిందన్నారు. కానీ, 108 రోజులుగా చేస్తున్న ఎంఎస్డబ్ల్యూపై ఎందుకు స్పందిస్తలేదని ప్రశ్నించారు. ఇకనైనా ప్రజాస్వామ్యాన్ని రక్షించి ప్యారానగర్ డంపింగ్‌యార్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా నల్లవల్లిలో శాంతియుతంగా జేఏసీ నాయకులు డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా రిలే నిరాహారదీక్షలు చేశారు.