జహీరాబాద్, మే 5: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆయుర్వేద వైద్యాధికారి గణపతి రావు పీహెచ్డీ పూర్తి చేశారు. కర్ణాటక రాష్ట్ర గవర్నర్ ఆయనకు పట్టాను అందజేయనున్నారు. బీదర్ సమీపంలోని ఎన్కే జబ్బాశెట్టి ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాలలో పీహెచ్డీ చేశారు. భగంధర వ్యాధిలో పలాశ క్షార సూత్ర చికిత్సపై విజయవంతంగా పరిశోధనకు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న రాజీవ్ గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసిన 27వ వార్షిక ఘటికోత్సవం సంధర్భంగా బెంగళూరులో గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ చేతుల మీదుగా పీహెచ్డీ పట్టా అందుకోనున్నారు. దీంతో గణపతి రావుకు డాక్టర్లు, సిబ్బంది అభినందించారు.