మునిపల్లి, ఆగస్టు 22 : సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనార్సిహ పర్యటన ఉండడటంతో సంబంధిత అధికారులు మితి మీరిన ఉత్సాహంతో రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను పూడ్చిచే పనిలో మునిగిపోయారు. మండల కేంద్రమైన మునిపల్లి చౌరస్తా నుంచి అల్లాపూర్ పోయే రోడ్డు మధ్యలో ఉన్న గుంతలను పూడ్చే కార్యక్రమంపై మండల వాసులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రికి పూలదారి..ప్రజలకు రాళ్ల దారిన అంటూ ప్రజలు మండి పడుతున్నారు. మంత్రి పర్యటనకు అధికారులు చేసే ఏర్పాట్లు సామాన్య జనాలు ప్రయాణం సాగించే సమయంలో ఎందుకు గుంతలు పూడ్చలేదు అని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. నిత్యం అదే రోడ్డు వెంట తిరిగే అధికారులకూ రోడ్డుపై పడ్డ గుంతలను పుడ్చాలన్నా ఆలోచన ఏందుకు రాలేదని, మంత్రి వస్తేనే గుంతలు పుడ్చేస్తారా అనీ మండల వాసులు సూటిగా ప్రశ్నించారు.
మరీ ఇంత నిర్లక్ష్యమా?
మంత్రి పర్యటన ఉందని నాలుగు రోజుల ముందే సమాచారం ఉన్నప్పటికి అధికారుల్లో మరీ ఇంత నిర్లక్ష్యం ఎందుకు అని అధికారుల తిరుపై మండి పడుతున్నారు. ఓ పక్కన మంత్రి అభివృద్ధి పనులు ప్రారంభించి పూజలు చేస్తుంటే.. ఓ పక్కన అధికారులు గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టడం విడ్డురంగా ఉంది.