మునిపల్లి, ఏప్రిల్ 12: ప్రభుత్వ వైఫల్యమా.. అధికారుల నిర్లక్ష్యమో తెలువదుగాని మునిపల్లి (Munipally) మండలంలోని పెద్దచెల్మడ గ్రామంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద గత వారం పది రోజుల క్రితం శనగల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నిర్ణించిన ధర రూ.5,650 ఉండగా, ప్రైవేట్ మార్కెట్లో శనిగాలా ధర రూ.6 వేలు ఉండడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వైపు రైతులు కన్నెత్తి చూడడం లేదు. ప్రభుత్వం పేరుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది తప్ప రైతులకు మేలు జరిగే మద్దతు ధర పెట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దచెల్మడ గ్రామంలో పీఏసీఎస్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రంలో ఒక్క కేజీ కూడా అమ్మాలేదంటే ఆశ్చర్యంగా ఉంది.
కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి వారం పది రోజులు గడిచిన సర్కారు కొనుగోలు కేంద్రంలో ఒక కిలో శనిగలు అమ్మడానికి రాలేదంటేనే అర్థం అవుతుంది. రైతుల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తుందో, రైతులు పండిస్తున్న పంటలకు సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే ప్రతి రైతన్నకు ఎంతో మేలు జరిగేదని రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్లో శనిగల ధర ఎక్కువ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ప్రైవేట్ మార్కెట్లో ధర ఎక్కువ ఉండడంతో రైతులు ప్రైవేట్ వైపే ముగ్గు చూపుతున్నారు.
ప్రభుత్వం రైతుల కోసం ఆలోచించి రైతులకు అనుకూలంగా ధరను ప్రకటించి సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే రైతులు మురుసుకుంటా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో శనగలు అమ్ముకునేవారు రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటూ రైతులకు మద్దతు ధర ప్రకటించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ముందు ముందు ప్రభుత్వం రైతుల కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు అనుకూలమైన ధర ముందే నిర్ణయించి సకాలంలో రైతులకు అవసరమైన చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మండల రైతులు వాపోతున్నారు.