Sand Storage | నిజాంపేట్, జూన్ 27 : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక అందించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు మండల హెడ్ క్వార్టర్లలో నిలువ చేసి సాడ్ బజార్గా ఒక్కొక్క ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 8 ట్రాక్టర్ల ఇసుకను అందించనున్నారు. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని 10 ప్రాంతాలలో ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించినట్లు జిల్లా హౌసింగ్ పీడీ చలపతి తెలిపారు.
గురువారం జోగిపేట పట్టణంలోని మల్లన్న కాలనీలో నిజాంపేట్ శివారులో ఇసుక నిలువ ఉంచేందుకు రవాణాకు స్థలాలను పరిశీలించారు. రెండు, మూడు రోజుల్లో మిగతా చోట్ల వివరాలు సేకరించి ఉన్నత అధికారులకు నివేదిక ఇస్తామన్నారు.
అనంతరం రాయకోడు వెళ్లారు. ఆయన వెంట నోడల్ అధికారి శ్రీనివాస్, మైనింగ్ శాఖ ఏడీ రఘుబాబు, నిజాంపేట్ తహసీల్దార్ నాగజ్యోతి ఆర్ఐ జాన్సన్ పీఓ రాంబాబు తదితరులు ఉన్నారు.