మునిపల్లి, ఏప్రిల్ 18: గ్రామాల్లో చెత్తను సేకరించి గ్రామ శివార్లలో నిర్మాణం చేపట్టిన డంపింగ్ యార్డుల్లో వేసేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతేక చర్యలు తీసుకొని గ్రామానికో డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టింది. గ్రామ సర్పంచ్ల పదవీ కాలం పూర్తవడంతో నేడు గ్రామాల్లో అధికారుల పాలన కొనసాగుతున్నది. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. మునిపల్లి మండలంలో పంచాయతీ అధికారుల పర్యవేక్షణ కరువైపోవడంతో గ్రామాల్లోని డంపింగ్ యార్డులు నిరూపయోగంగా దర్శనామిస్తున్నాయి.
మునిపల్లి మండలంలోని హైదలాపూర్ గ్రామంలో గతా ప్రభుత్వ హయాంలో నిర్మాణం చెప్పట్టిన డంపింగ్ యార్డును గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన సొంత అవసరలకు వినయోగించుకుంటున్న సంబందితా అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్తను సేకరించేవారు లేక గ్రామంలో గల్లీలు అన్నీ చెత్త నిండి పోతుందని విమర్శిస్తున్నారు. గ్రామంలోని డంపింగ్ యార్డులో వేసుకున్న ఉల్లిగడ్డను తొలగించి, వెంటనే దానిని వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను కోరుతున్నారు.